By: ABP Desam | Updated at : 10 Aug 2023 09:03 AM (IST)
బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయా, ఆగుతాయా?
RBI MPC Meeting Results Today: దేశంలో బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయో, లేదో అన్న విషయం కాసేపట్లో తెలిసిపోతుంది. ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇవాళ ప్రకటిస్తుంది. ఆర్‌బీఐ మూడు రోజుల ఎంపీసీ మీటింగ్ ఈ నెల 8న ప్రారంభమై ఈరోజు (ఆగస్టు 10) ముగుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ఏ నిమిషంలోనైనా లైవ్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న మూడో ఎంపీసీ మీటింగ్ ఇది. ఈసారి కూడా రెపో రేట్‌లో (Repo Rate) ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుత రేటు 6.50 శాతం వద్దే దానిని ఆర్‌బీఐ ఉంచుతుందని చాలా మంది ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అయితే, దేశంలో ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. పెరుగుతున్న ఇన్‌ఫ్లేషన్ భారతదేశ GDP వృద్ధికి కొంత అవరోధంగా మారవచ్చు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్‌బీఐ డెసిషన్ ఉంటుంది.
రెపో రేట్ పెరిగితే ఏం జరుగుతుంది?
రెపో రేట్ అంటే, దేశంలోని వాణిజ్య బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ (RBI) ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేట్ పెరిగితే బ్యాంకులపై భారం పెరుగుతుంది. ఆ భారాన్ని అవి కస్టమర్ల మీదకు నెడతాయి. అంటే, దేశంలోని బ్యాంకులు కూడా, తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, రెపో రేట్ పెరిగితే బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయి, రెపో రేట్ తగ్గితే బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. దీనికి అనుగుణంగా ప్రజలపై ప్రభావం పడుతుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో, RBI మొత్తం ఆరు సార్లు రెపో రేటును పెంచింది. ఈ ఆరు దఫాల్లో కలిపి మొత్తం 2.50 శాతం (250 బేసిస్ పాయింట్లు) పెంచింది, రెపో రేటును 4,00 శాతం నుంచి 6.50 శాతానికి తీసుకెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు (ఏప్రిల్, జూన్) క్రెడిట్ పాలసీ మీటింగ్స్‌లోనూ రెపో రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి మార్పు చేయలేదు.
తేదీ రేపో రేటు మార్పు (బేసిస్ పాయింట్లు)
08-జూన్-2023 6.50% 0
06-ఏప్రిల్-2023 6.50% 0
08-ఫిబ్రవరి-2023 6.50% 25
07-డిసెంబర్-2022 6.25% 35
30-సెప్టెంబర్-2022 5.90% 50
05-ఆగస్టు-2022 5.40% 50
08-జూన్-2022 4.90% 50
04-మే-2022 4.40% 40
09-అక్టోబర్ 2022 4.00% 0
మీ EMI మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు
ఆర్‌బీఐ, కీలక రేట్లను (Repo Rate) మార్చకపోతే, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచవు. ఫలితంగా, బ్యాంక్ EMIల మీద కూడా భారం పెరగదు, ఉపశమనం ఉంటుంది. అయితే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి రెపో రేట్ పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయిస్తే మాత్రం బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయి. దాంతోపాటే EMIల భారమూ పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Natco, Hero, LIC, Suzlon
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Aadhaar Card Update: ఆధార్‌ను 'ఫ్రీ'గా అప్డేట్ చేసేందుకు మరింత సమయం - ఆన్లైన్లో ఎలా అప్డేట్ చేయాలి?
PAN Card: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు
Car Insurance: కారు బీమా - వారెంటీల విషయంలో ఓనర్లకు ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవీ
Gold Rate Ttoday: రూ.1,300 తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి