News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Stocks To Watch 10 August 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Natco, Hero, LIC, Suzlon

మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

FOLLOW US: 
Share:

Stock Market Today, 10 August 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.10 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 20 పాయింట్లు లేదా 0.10 శాతం రెడ్‌ కలర్‌లో 19,592 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

దేశంలో వడ్డీ రేట్ల పెంపుపై ఇవాళ ఉదయం రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటన ఉంటుంది.

ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: LIC, పిడిలైట్, గ్రాసిమ్, హీరో మోటోకార్ప్, సెయిల్. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

సుజ్లాన్ ఎనర్జీ: రూ. 2,000 కోట్ల వరకు సమీకరణ కోసం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌ను ప్రారంభించేందుకు సుజ్లాన్ ఎనర్జీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించింది.

యాక్సిస్ బ్యాంక్: ప్రిఫరెన్షియల్ బేసిస్‌లో షేర్లు తీసుకుని, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ. 1,612 కోట్ల పెట్టుబడి పెట్టడానికి యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం పొందింది.

BSE: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బీఎస్‌ఈ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం 1000% పెరిగి రూ. 440 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ఆదాయం 15% పెరిగి రూ. 216 కోట్లకు చేరుకుంది.

ZEE: ఏప్రిల్‌-జూన్‌ కాలంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ రూ. 53.4 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అదే కాలంలో ఆదాయం 8% పెరిగి రూ.1,984 కోట్లుగా నమోదైంది.

జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో టాటా పవర్ ఏకీకృత నికర లాభం 29% జంప్‌తో రూ. 1,140.97 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీకి కార్యకలాపాల ద్వారా రూ. రూ. 15,484.71 కోట్ల ఆదాయం వచ్చింది, ఇది దాదాపు 5% వృద్ధి.

సులా వైన్‌యార్డ్స్‌: Q1 FY24లో సులా వైన్‌యార్డ్స్ రూ. 13.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.108 కోట్ల ఆదాయం ఆర్జించింది.

IRCTC: 2023-24 తొలి త్రైమాసికంలో రూ.232 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని IRCTC సంపాదించింది. కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17% పెరిగి రూ. 1,002 కోట్లకు చేరుకుంది.

బాటా ఇండియా: జూన్ క్వార్టర్‌లో బాటా ఇండియా రూ.107 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా రూ. 958 కోట్ల ఆదాయం వచ్చింది.

M&M: మహీంద్ర అండ్‌ మహీంద్ర అనుబంధ కంపెనీ మహీంద్ర లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ, త్రీ-వీలర్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఆటో) ‘ఈ- ఆల్ఫా సూపర్‌’ను మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. దీని ధర రూ.1.61 లక్షలు. ఒక ఛార్జింగ్‌తో ఈ బండి 95 కి.మీ. ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.

నాట్కో ఫార్మా: ఈ ఫార్మా కంపెనీ జూన్‌ త్రైమాసికంలో రికార్డ్‌ సృష్టించింది. ఆ కాలంలో రూ. 420.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది, ఆదాయం రూ.1160.2 కోట్లుగా ఉంది. కంపెనీ చరిత్రలో, ఏ త్రైమాసికంలోనైనా ఇదే రికార్డ్‌ స్థాయి లాభం, ఆదాయం. YoYలో నెట్‌ ప్రాఫిట్‌ 31.2%, రెవెన్యూ 26.3% పెరిగాయి.

విజయ డయాగ్నోస్టిక్స్‌: మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 121 కోట్ల ఏకీకృత ఆదాయం సంపాదించింది, YoYలో 16% అధికం. నికర లాభం రూ. 17.5 కోట్ల నుంచి రూ. 26.2 కోట్లకు చేరింది, ఇది 50.2% గ్రోత్‌.

ఇది కూడా చదవండి: టర్మ్‌ ప్లాన్స్‌లో ఇది ప్రత్యేకం - లైఫ్‌ కవర్‌తో పాటు ప్రీమియం రిటర్న్‌ కూడా ఉంటుంది

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Aug 2023 08:17 AM (IST) Tags: stocks in news Stock Market Buzzing stocks Stocks to Buy Q1 Results

ఇవి కూడా చూడండి

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్‌ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి