News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: ఏపీలో సమ్మెకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు - నేటి టాప్ 10 వార్తలు మీకోసం

తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

తొలి సంతకంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. దేశంలో అంబేద్కర్ పేరు మీదుగా ఉన్న ఏకైక సచివాలయం తెలంగాణ సెక్రటేరియట్. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ బిల్డిండ్ ఆరో అంత‌స్తులోని త‌న ఛాంబ‌ర్‌లో ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీలక ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌ ( Contract Employees Regularisation)పై సీఎం కేసీఆర్ మొద‌టి సంత‌కం చేశారు. దాంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి

ఏపీ ప్రభుత్వానికి మా సత్తా చూపిస్తాం: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యమానికి రెడీ అవుతోంది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశం మీద నిర్దిష్టమైన పరిష్కారం ప్రభుత్వం చూపించలేదని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. మే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తమ ఆందోళనకు సంబంధించిన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. మే 22 న కార్యచరణ ప్రారంభమై అక్టోబరు 31 వరకు వివిధ దశల్లో ఆందోళన చేపడతాం.. అక్టోబరు 31 న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి నిరవధిక సమ్మెను చేపడతాం అని హెచ్చరించారు. ఇంకా చదవండి

హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

తెలంగాణలో మరో నాలుగైదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలైంది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మియపూర్ కుత్బుల్లాపూర్ ఏరియాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలుతో వర్షం మొదలుకాగానే, పలు ఏరియాలలో కరెంట్ కోత పెట్టారు. నగరంలో పలు ప్రాంతాలు అంధకారంగా మారాయి. ఇంకా చదవండి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత! ఎయిమ్స్‌కి తరలింపు

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ఉండగా, కుటుంబ సభ్యులు వెంటనే కిషన్ రెడ్డిని ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. అయితే, ఆయనకు గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్‌ కేర్‌ యూనిట్‌లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్‌ సమస్యే ఉన్నట్లుగా డాక్టర్లు తేల్చి చెప్పారు. చికిత్స తర్వాత సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేస్తారని తెలుస్తోంది. పూర్తి కథనం

‘ఢీ’ పేరు ఇస్తుంది, జబర్దస్త్ డబ్బులు ఇస్తుంది - సూసైడ్ సెల్ఫీ వీడియోలో చైతు మాస్టర్ ఆవేదన

ఢీ ప్రోగ్రామ్ పేరు ఇస్తుంది కానీ, సంపాదన తక్కువగా ఇస్తుంది. జబర్దస్త్ పేరుతోపాటు సంపాదన కూడాబాగా ఇస్తుంది. ఇదీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆవేదన. అయితే సంపాదనకంటే ఎక్కువ అప్పులు చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఢీ ప్రోగ్రామ్ తో పేరు వచ్చినా, సంపాదించుకోలేకపోతున్నామని, ఇల్లు, టీవీలు.. ఏవీ కొనుక్కోలేకపోయామని సెల్ఫీ వీడియోలో చెప్పారు చైతన్య. నెల్లూరులోని క్లబ్ లో ఆత్మహత్య చేసుకున్న చైతన్య సెల్ఫీ వీడియోని తన స్నేహితులకు పంపించాడు. ఆ తర్వాత ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకా చదవండి

అధికారంలోకి రాగానే ఆర్టీసీకి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం- బండి సంజయ్

ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నమో ఆ లక్ష్యం నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని కాచిగూడలో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన  పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే బండి సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం 40 మంది ఆర్టీసీ కార్మికులు బలయ్యారని గుర్తు చేశారు. నాడు చర్చలు జరిపే దాకా బాబు అనే ఆర్టీసీ కార్మికుడి అంత్యక్రియలు నిర్వహించమని.. తాము కరీంనగర్ లో భీష్మించుకు కూర్చుండబట్టే కేసీఆర్ చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారన్నారు. అలాగే సీఎం కేసీఆర్ తమపై లాఠీచార్జ్ చేయించి, జైలుకు పంపించాడని, ఆఖరికి శవాలను కూడా ఎత్తుకుపోయిండంటూ ఆరోపించారు. అంతిమ యాత్ర నిర్వహిస్తుంటే పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి శవాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తు చేశారు. ఇంకా చదవండి

ఇవాళ బ్యాంక్‌లకు సెలవు, ఈ నెలలో 12 రోజులు పని చేయవు

2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండో నెల అయిన మే ప్రారంభం అయింది. నెల ప్రారంభానికి ముందే, "మే నెలలో బ్యాంకులకు సెలవుల జాబితా"ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. 

సామాన్యుల జీవితంలో బ్యాంకులు అంతర్భాగం. డబ్బు లావాదేవీలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు స్వీకరించడం, చెక్కులు డిపాజిట్ చేయడం వంటి చాలా పనులకు బ్యాంకులు అవసరం. బ్యాంకులకు సెలవు వస్తే ఖాతాదార్ల ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. మీకు కూడా మే నెలలో కొన్ని ముఖ్యమైన బ్యాంక్‌ పనులు ఉంటే, ఈ సెలవుల జాబితాను (May Bank Holiday List) గుర్తు పెట్టుకోండి. ఇలా చేస్తే.. సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా చదవండి

క్వాల్‌కమ్‌లోనూ లేఆఫ్‌లు, చిప్‌ మేకింగ్‌లో కింగ్ అయినా తప్పని నష్టాలు

చిప్ తయారీలో అంతర్జాతీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న క్వాల్‌కమ్ కంపెనీకి కూడా కష్టాలు తప్పడం లేదు. రెవెన్యూ గ్రోత్ లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే...లేఆఫ్‌లు ప్రకటించింది. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు టెంపరరీ ఉద్యోగులనూ తొలగించేందుకు సిద్ధమవుతోంది. వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని ఆ మేరకు కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావిస్తోంది. కేవలం కాలిఫోర్నియా క్యాంపస్‌లోనే దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించనుంది క్వాల్‌కమ్. మే 3వ తేదీన ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అదే రోజు క్వార్టర్లీ రిజల్ట్స్‌నీ విడుదల చేయనుంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో కనీసం 5% మేర కోత విధించేందుకు ఆ కంపెనీ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే...మొబైల్ డివిజన్‌లోనే భారీగా ఉద్యోగాల కోత ఉండనుంది. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనే 20% మేర కోతలు తప్పేలా లేవు. కొద్ది నెలలుగా క్వాల్‌కమ్ కంపెనీ సేల్స్, రెవెన్యూ దారుణంగా పడిపోయాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని చెబుతోంది. ఇంకా చదవండి

'పొన్నియన్ సెల్వన్ 2' కలెక్షన్స్: రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు

లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఇది దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడింది. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా, దాదాపు వెయ్యేళ్ళ క్రితం నాటి చోళుల కథాంశంతో ఈ యాక్షన్ డ్రామాని రూపొందించారు. విస్తృతమైన కథ కావడంతో రెండు భాగాలుగా ప్లాన్ చేసిన మేకర్స్.. గతేడాది మొదటి భాగం 'PS 1' చిత్రాన్ని విడుదల చేసారు. ఇప్పుడు రీసెంట్ గా 'PS 2' పేరుతో రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇంకా చదవండి

1000వ మ్యాచ్‌లో ముంబై విక్టరీ - మూడు సిక్సర్లతో గెలిపించిన టిమ్ డేవిడ్!

ఐపీఎల్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన దశలో టిమ్ డేవిడ్ (45 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగాడు.

ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (55: 29 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా యశస్వి జైస్వాల్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. యశస్వి జైస్వాల్ తప్ప మరే ఇతర రాజస్తాన్ బ్యాటర్ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఇంకా చదవండి

Published at : 01 May 2023 08:31 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today

సంబంధిత కథనాలు

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

WCDSCD Sangareddy: సంగారెడ్డి జిల్లా చైల్డ్‌ హెల్ప్‌లైన్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!

Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు

Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు కేసీఆర్ భారీ బోనస్ ప్రకటన - ఈసారి ఏకంగా రూ.700 కోట్లు

ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

టాప్ స్టోరీస్

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి