News
News
వీడియోలు ఆటలు
X

Bank Holiday: ఇవాళ బ్యాంక్‌లకు సెలవు, ఈ నెలలో 12 రోజులు పని చేయవు

బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి.

FOLLOW US: 
Share:

Bank Holidays list in May: 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండో నెల అయిన మే ప్రారంభం అయింది. నెల ప్రారంభానికి ముందే, "మే నెలలో బ్యాంకులకు సెలవుల జాబితా"ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. 

సామాన్యుల జీవితంలో బ్యాంకులు అంతర్భాగం. డబ్బు లావాదేవీలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు స్వీకరించడం, చెక్కులు డిపాజిట్ చేయడం వంటి చాలా పనులకు బ్యాంకులు అవసరం. బ్యాంకులకు సెలవు వస్తే ఖాతాదార్ల ముఖ్యమైన పనులు నిలిచిపోతాయి. మీకు కూడా మే నెలలో కొన్ని ముఖ్యమైన బ్యాంక్‌ పనులు ఉంటే, ఈ సెలవుల జాబితాను (May Bank Holiday List) గుర్తు పెట్టుకోండి. ఇలా చేస్తే.. సెలవు రోజున బ్యాంకుకు వెళ్లి, మూసేసిన గేటును చూసి ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సిన అవసరం ఉండదు.

మేలో బ్యాంకులు మూతబడే రోజుల సంఖ్య
ఈ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల కారణంగా వచ్చే సెలవులు కూడా కలిసి ఉన్నాయి. ఈ నెలలో.. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం, బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి వంటి కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది. 

2023 మే నెలలో బ్యాంకులకు సెలవు రోజులు:

మే 1, 2023- మహారాష్ట్ర అవతరణ దినోత్సవం/మే డే సందర్భంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నాగ్‌పుర్, పనాజీ, పాట్నా, త్రివేండ్రంలలో బ్యాంకులను మూసివేస్తారు
మే 5, 2023- బుద్ధ పూర్ణిమ కారణంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, ముంబై, నాగ్‌పుర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు పని చేయవు
మే 7, 2023- ఆదివారం కారణంగా, దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
మే 9, 2023- రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కారణంగా కోల్‌కతాలో బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి
మే 13, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 14, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 16, 2023- సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కారణంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు పని చేయవు
మే 21, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 22, 2023- మహారాణా ప్రతాప్ జయంతి కారణంగా సిమ్లాలో బ్యాంకులను హాలిడే
మే 24, 2023- కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి సందర్భంగా త్రిపురలోని బ్యాంకులు పని చేయవు
మే 27, 2023- నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
మే 28, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. అయితే, బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా చేయవలసి వస్తే ATMని ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

Published at : 01 May 2023 07:38 AM (IST) Tags: Bank holidays Bank Holiday list May 2023

సంబంధిత కథనాలు

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు