Hyderabad Rains: హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు - పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలైంది.
Heavy Rains In Telangana: తెలంగాణలో మరో నాలుగైదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ భారీగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలైంది. పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, కూకట్ పల్లి, మియపూర్ కుత్బుల్లాపూర్ ఏరియాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలుతో వర్షం మొదలుకాగానే, పలు ఏరియాలలో కరెంట్ కోత పెట్టారు. నగరంలో పలు ప్రాంతాలు అంధకారంగా మారాయి.
OMG.... Massive Spell over #Hyderabad Now⛈️💨💨💨#HyderabadRains pic.twitter.com/g8yILHGOUw
— Hyderabad Rains (@Hyderabadrains) April 30, 2023
జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తో పాటు బోరబండ, జీడిమెట్ల, ఫిల్మ్‌నగర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, ఎర్రగడ్డ, సనత్ నగర్, మూసాపేట సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. పెద్ద పెద్ద చినుకులతో వాన పడటంతో నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం తలెత్తింది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. భారీగా వర్షపు నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి.
@Hyderabadrains raining like rainy season 🌧️🌧️ pic.twitter.com/o7e8YlyZif
— Gannoj Sai Chandan (@saichandanganoj) April 30, 2023
భారీ వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ జారీ
అల్పపీడన ద్రోణి ఉత్తర కర్ణాటక నుండి తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో నాలుగు నుంచి ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాగల 5 రోజులలో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 30 డిగ్రీల కన్నా తక్కువ నమోదు అయ్యే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగళ్లు, ఈదురు గాలులు (ఈ రోజు 40 నుండి 50 కిలో మీటర్ల గాలి వేగంతో) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
RED ALERT for Entire #Hyderabad!
— Hyderabad Rains (@Hyderabadrains) April 30, 2023
During the next 2Hrs ENTIRE #HYDERABAD will see HEAVY RAINS with ⛈️💨⚡⚠️
Rains will First Start over #Rajendranagar,#Gachibowli,#Manikonda,#Serlingampally,#Patancheru Surroundings & Will cover Entire City.
Stay Alert!#HyderabadRains pic.twitter.com/Pm0j2iYnFm
తెలంగాణలో నేడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు (40-50 కిలో మీటర్లు) వడగండ్లతో కూడిన భారీ వర్షం అక్కడక్కడ కురుస్తుందని అధికారులు తెలిపారు. ఈ జిల్లా్లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో, వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.