Qualcomm Layoffs: క్వాల్‌కమ్‌లోనూ లేఆఫ్‌లు, చిప్ మేకింగ్‌లో కింగ్ అయినా తప్పని నష్టాలు
Qualcomm Layoffs: క్వాల్‌కమ్ కంపెనీ కూడా త్వరలోనే లేఆఫ్‌లపై అధికారిక ప్రకటన చేయనుంది.
Qualcomm Layoffs:
1,500 మందికి గుడ్‌బై..
చిప్ తయారీలో అంతర్జాతీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న క్వాల్‌కమ్ కంపెనీకి కూడా కష్టాలు తప్పడం లేదు. రెవెన్యూ గ్రోత్ లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే...లేఆఫ్‌లు ప్రకటించింది. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు టెంపరరీ ఉద్యోగులనూ తొలగించేందుకు సిద్ధమవుతోంది. వర్క్‌ఫోర్స్‌ని తగ్గించుకుని ఆ మేరకు కాస్ట్ కటింగ్ చేసుకోవాలని భావిస్తోంది. కేవలం కాలిఫోర్నియా క్యాంపస్‌లోనే దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించనుంది క్వాల్‌కమ్. మే 3వ తేదీన ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అదే రోజు క్వార్టర్లీ రిజల్ట్స్‌నీ విడుదల చేయనుంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో కనీసం 5% మేర కోత విధించేందుకు ఆ కంపెనీ ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే...మొబైల్ డివిజన్‌లోనే భారీగా ఉద్యోగాల కోత ఉండనుంది. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనే 20% మేర కోతలు తప్పేలా లేవు. కొద్ది నెలలుగా క్వాల్‌కమ్ కంపెనీ సేల్స్, రెవెన్యూ దారుణంగా పడిపోయాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని చెబుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ డివిజన్‌లో ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొంటోంది ఈ సంస్థ. క్వాల్‌కమ్ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు బాగా పడిపోయాయి. అందుకే...ఉన్న రీసోర్సెస్‌లను కాస్త తగ్గించుకుని మిగతా వాటితో కంపెనీని రన్ చేయాలని భావిస్తోంది. 2022 డిసెంబర్ నాటికే క్వాల్‌కమ్ యాన్యువల్ ప్రాఫిట్ 34% మేర తగ్గిపోయింది. రెవెన్యూలోనూ 12% మేర కోత పడింది. ఈ నష్టం మరీ ఎక్కువ అవ్వకముందే అప్రమత్తమవుతోంది కంపెనీ. అందుకే ఉద్యోగులను తొలగించి ఆ మేరకు రెవెన్యూని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.
మెటాలో మరో రౌండ్..
మెటా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. మళ్లీ లేఆఫ్‌లు ప్రకటించనుంది. టీమ్ రీస్ట్రక్చర్‌లో భాగంగా మరి కొంత మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేనేజర్‌లకు ఈ విషయమై సమాచారం కూడా అందించింది మెటా యాజమాన్యం. మెమోల ద్వారా మేనేజర్లు టీమ్ మెంబర్స్‌కి ఈ లేఆఫ్‌ల గురించి చెప్పాలని ఆదేశించింది. Bloomberg News ఇదే విషయాన్ని రిపోర్ట్ చేసింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు రియాల్టీ ల్యాబ్స్‌లోని ఉద్యోగులపైనా ఈ ఎఫెక్ట్ పడనుంది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది మెటా. ఈ ఏడాది మార్చిలోనే జుకర్ బర్గ్ కీలక ప్రకటన చేశారు. 10 వేల మందిని తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నారు. మే నెలలో మరో రౌండ్ లేఆఫ్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే గతేడాది నవంబర్‌లో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13% మందిని తొలగించింది మెటా. 11 వేల మందిని ఫైర్ చేసింది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లోనూ ఇదే కొనసాగింది. స్టాఫ్ బ్యాలెన్సింగ్ కోసం ఈ లేఆఫ్‌లు (Layoffs) ప్రకటించక తప్పడం లేదని గతంలోనూ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇప్పుడు టీమ్ రీఆర్గనైజేషన్‌లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఇక మిగిలిన ఉద్యోగులను కొత్త ప్రాజెక్టుల్లోకి బదిలీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉండగా, 2022 సంవత్సరం నుంచి ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందిపై వేటుపడింది.
Also Read: Ukraine News: కాళిమాతపై ఉక్రెయిన్ అభ్యంతరకర ట్వీట్, ఫైర్ అయిన ఇండియన్స్ - నిముషాల్లోనే డిలీట్