News
News
వీడియోలు ఆటలు
X

CM KCR: తొలి సంతకంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త, కృతజ్ఞతలు తెలిపిన హరీష్ రావు

CM KCR first sign At Telangana secretariat: స‌చివాల‌యం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌ పై మొద‌టి సంత‌కం చేశారు.

FOLLOW US: 
Share:

CM KCR first sign At Telangana secretariat: కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. దేశంలో అంబేద్కర్ పేరు మీదుగా ఉన్న ఏకైక సచివాలయం తెలంగాణ సెక్రటేరియట్. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యం ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ బిల్డిండ్ ఆరో అంత‌స్తులోని త‌న ఛాంబ‌ర్‌లో ఆసీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీలక ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌ ( Contract Employees Regularisation)పై సీఎం కేసీఆర్ మొద‌టి సంత‌కం చేశారు. దాంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
మాటనిలబెట్టుకున్న సీఎం కేసీఆర్, కృత‌జ్ఞత‌లు తెలిపిన మంత్రి హరీష్ రావు
నూతన సచివాలయం ప్రారంభించిన శుభసందర్భంగా సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైలుపై సంతకం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు’ అని మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మెడికల్ శాఖలో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మొత్తం 40 విభాగాలకు చెందిన 5,544 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ కేసీఆర్ ఫైలుపై సంతకం చేశారని తెలుస్తోంది.

ఇది నా పూర్వజన్మ సుకృతం: సీఎం కేసీఆర్ 
తెలంగాణ కొత్త సచివాలయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. సచివాలయం ఎంత సస్యశ్యామలంగా ఉందో రాష్ట్రంలోని పల్లెలు కూడా అలాగే అలరారుతూ ఉన్నాయని అన్నారు. ఈ 9 ఏళ్ల కాలంలో తనతో పాటు ఉండి పాలనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి సీఎం కేసీఆర్ చేతులెత్తి నమస్కరించారు. నేడు (ఏప్రిల్ 30) కేసీఆర్ తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు. తన ఛాంబర్‌లోని సీట్‌లో ఆసీనులై కీలకమైన ఆరు ఫైల్స్ పై సంతకం చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

అంబేడ్కర్ చూపిన బాటలోనే ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ఆయన కీర్తిని దేశమంతా చాటాలనే ఉద్దేశంతో నిలువెత్తు ఉద్దేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అంబేడ్కర్ సమానత్వ భావాలు, ఆయన అడుగుజాడల్లోనే నడవాలనే ఉద్దేశంతో రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరే పెట్టుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణ పోరాటంలో అమరులైన వారిని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఉన్నయన్ని కూలగొట్టి కొంత మంది కురచ వ్యక్తులు, మరుగుజ్జులు కారు కూతలు కూశారు. పునర్నిర్మాణం అంటే తెలియని మరుగుజ్జులకు నేను ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను.

Published at : 30 Apr 2023 05:25 PM (IST) Tags: Telangana Secretariat Telangana KCR Harish Rao Staff Nurse Jobs

సంబంధిత కథనాలు

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

TS Police DV: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు! ఇవి తప్పనిసరి!

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Saroornagar News: అప్సరకు అబార్షన్, పోలీసులతో నిందితుడు సాయిక్రిష్ణ, తల్లి వాదన మరోలా!

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

Group 1 Exam: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఏమందంటే?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు