Top Headlines Today: డిఫరెంట్‌గా చంద్రబాబు ప్రచార వ్యూహం; తెలంగాణలో దివ్యాంగులకు గుడ్‌న్యూస్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
దివ్యాంగులకు శుభవార్త
దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4016కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు జులై నెల పింఛను నుంచే సవరించిన పింఛను రూ.4016 అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది. జూన్ 9న మంచిర్యాలలో జరిగిన సభలో వికలాంగుల ఫించను రూ. 3,016 రూపాయల నుంచి రూ. 4,106 లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ పెరిగిన పింఛన్లు జులై నెల నుంచి అమలులోకి రానున్నట్లు సర్కార్ తాజాగా జీవో ఇచ్చింది. ఇంకా చదవండి
విభిన్నంగా చంద్రబాబు ప్రచార వ్యూహం
ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. తెలంగాణతో పాటు ఎన్నికలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది సీఎం జగన్ చాయిస్. ఆయన మాత్రం మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారని.. ముందస్తు ఆలోచనే లేదని పార్టీ నేతలకు చెబుతున్నారు. అయినా సరే.. ఆ తర్వాత మరో ఐదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున ఆ వేడి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర వచ్చే ఏడాది వరకూ సాగనుంది. చంద్రబాబు కూడా మరో వైపు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇంకా చదవండి
అన్నమయ్య జిల్లా బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సుకు జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున సహాయం చేయాలని నిర్ణయించారు. కాగా, ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఇంకా చదవండి
వారసుడి కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నం
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ ఆశావహులు పెరిగిపోతున్నారు. కొంత మంది నేతలు పదవుల్లో ఉన్పన్పటికీ.. కుమారుల కోసం రంగంలోకి దిగుతున్నారు. ఈ జాబితాలోకి బీఆర్ఎస్ కీలక నేత గుత్తా సఖేందర్ రెడ్డి కూడా చేఱారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు కానీ..తన కుమారుడికి చాన్సివ్వాలని ఆయన కోరుతున్నారు. నేరుగా హైకమాండ్‌కు చెప్పారో లేదో కానీ.. మీడియా ప్రతినిధుల్ని పిలిచి తన మనసులో మాట చెప్పారు. ఇంకా చదవండి
రేపు మరో అల్పపీడనం - వచ్చే 5 రోజులు భారీ వర్షాలు
నిన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న అవర్తనం నైరుతి విదర్భ & పరిసరాల్లోని దక్షిణ ఛత్తీస్ ఘడ్ వద్ద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఇంకా చదవండి
బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా దారుణం
మణిపూర్ వైరల్ వీడియోపై దేశమంతా భగ్గుమంటోంది. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే ఇలాంటి దారుణమే మరోటి వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని మల్దాలో ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా రోడ్డుపై తిప్పుతూ దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు మహిళలపై దాడి చేసిన స్థానికులు...తరవాత వాళ్లను అర్ధనగ్నంగా రోడ్లపై ఊరేగించారు. మహిళలు కూడా వాళ్లపై దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంత జరిగినా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. ఇంకా చదవండి
సూర్య ‘కంగువా’ గ్లింప్స్ వచ్చేసింది!
తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న పీరియాడిక్ సినిమా ‘కంగువా’. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ‘కంగువా’ గ్లింప్స్‌ను సూర్య పుట్టినరోజు సందర్భంగా జులై 23వ తేదీన అర్థ రాత్రి 12:01 గంటలకు విడుదల చేశారు. సూర్య ఈ సినిమాలో యోధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా చదవండి
ఆగస్టులో కాదు, లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమకు పెద్దల నుంచి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వచ్చే నెలలో వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇంకా చదవండి
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌కు బెస్ట్ ప్రత్యామ్నాయాలు ఇవే
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా తన కొత్త మిడ్-సైజ్ ఫేస్‌లిఫ్ట్ సెల్టోస్ SUV ధరలను ప్రకటించింది. భారతదేశంలో 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 10.89 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అవే టెక్ లైన్, జీటీ లైన్, ఎక్స్ లైన్. ఈ మూడు ట్రిమ్‌ల్లో కూడా చాలా వేరియంట్లు ఉన్నాయి. ఇంకా చదవండి
కొడుకును వదిలేసి, కోహ్లీని హత్తుకున్న విండీస్ క్రికెటర్ తల్లి - వీడియో వైరల్
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగిఉన్న కోహ్లీకి మరో డైహార్డ్ ఫ్యాన్ వచ్చారు. వెస్టిండీస్ వికెట్ కీపర్ జోషువా డి సిల్వ తల్లి.. భారత్ - వెస్టిండీస్ మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా కింగ్ కోహ్లీని కలుసుకుంది. కోహ్లీని చూడగానే ఆమె ఆనందంతో అతడిని మనసారా హత్తుకుని భావోద్వేగానికి గురైంది. తన కొడుకు టెస్టు ఆడుతున్నా.. తాను మాత్రం విరాట్ ఆట చూసేందుకే వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. ఇంకా చదవండి