Varun Tej Lavanya Tripathi Wedding : ఆగస్టులో కాదు, లావణ్యతో వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడంటే? అదీ ఎక్కడంటే?
Varun Tej Lavanya Tripathi Wedding Date : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ బ్యూటీ లావణ్యా త్రిపాఠి పెళ్లి తేదీ ఖరారు అయినట్లు సమాచారం. వెడ్డింగ్ వెన్యూ కూడా ఫైనలైజ్ చేశారట.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమకు పెద్దల నుంచి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వచ్చే నెలలో వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
ఇటలీలో వరుణ్, లావణ్య పెళ్లి!
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని వరుణ్ తేజ్, లావణ్య ప్లాన్స్ చేస్తున్నారట. అంటే, ఇండియాలో కాకుండా... విదేశాల్లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారట. వాళ్ళు ఇద్దరు ఇటలీలో ఏడు అడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది. ఆగస్టులో పెళ్లి జరుగుతుందని కొందరు చెబుతున్నారు. అది నిజం కాదని, నవంబర్ నెలలో పెళ్లి జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటలీలో పెళ్లి అనేది నిజమే!
నిశ్చితార్థం జరిగినట్లే...
పెళ్లికి కూడా కొందరే!
జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. ఆ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులను మాత్రమే ఇన్వైట్ చేశారు. పెళ్ళికి కూడా ఆ విధంగా కొంత మందిని ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారట. పెళ్ళైన కొన్ని రోజులకు హైదరాబాద్ సిటీలో సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
అతి త్వరలోనే పెళ్లి కబురు!
Varun Tej Lavanya Tripathi Marriage : వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం చేసుకోబోతున్నారనే విషయం ప్రేక్షకులకు పెద్దగా ఆశ్చర్యం ఏమీ కలిగించలేదు. ఆల్రెడీ తెలిసిన విషయమే. ఎవరెవరిని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారో లిస్టు రెడీ అయ్యిందట. వాళ్ళకు త్వరలో పెళ్లి కబురు చెప్పనున్నారు.
Also Read : ఫ్యాన్స్‌ను భయపెడుతున్న మహేష్ బాబు ఫారిన్ టూర్లు
ప్రేమ విషయం ఎప్పుడు బయట పడింది?
'మిస్టర్'లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి తొలిసారి జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత 'అంతరిక్షం'లో మరోసారి జంటగా నటించారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. రీతూ వర్మతో కలిసి వెళ్లారు. నిహారికకు వాళ్ళిద్దరు స్నేహితులే. అయితే... వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడింది. మెగా ఫ్యామిలీకి చెల్లెలి పెళ్ళిలో తన ప్రేమ సంగతి చెప్పారట.
Also Read : 'ఓపెన్ హైమర్' రివ్యూ : ఇది నోలన్ సినిమా, అణుబాంబు సృష్టికర్త బయోపిక్!
ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సినిమా చేశారు. ఆగస్టు 25న ఆ విడుదల కానుంది. ఆ సినిమా కాకుండా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి సమయానికి షూటింగులు ఏవీ లేకుండా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శక నిర్మాతలకు ఆ విషయం చెప్పేశారట.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial