అన్వేషించండి

Top 5 Headlines Today: నాకు ప్రాణహాని, అందరూ జాగ్రత్త: పవన్ - నేటి టాప్ 10 న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

క్యాడర్ ను రెడీ చేసుకోవడమే వైఎస్ఆర్‌సీపీకి అతి పెద్ద టాస్క్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీగా మరింత జోష్‌లో ఉండాల్సిన ఆ పార్టీ .. క్యాడర్‌లో ఉత్సాహం కనిపించక డీలా పడుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో దేంట్లేనూ క్యాడర్ ను భాగం చేయలేదు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే చూసుకున్నారు. దీంతో వారంతా నిద్రాణంగా మారిపోయారు. ఆ పరిస్థితి గుర్తించి ఇప్పుడు వారందర్నీ మళ్లీ యాక్టివ్ చేసేందుకు వైఎస్ఆర్‌సీపీ అనుబంధ సంఘాల చీఫ్ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంకా చదవండి

నా కోసం సుపారీ గ్యాంగుల్ని దింపారు, ప్రాణహాని ఉంది - పవన్ కల్యాణ్

జనసేన పార్టీ నాయకులతో సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తనకు తెలిసిందని అన్నారు. అందుకోసం కొందరు ప్రత్యేకంగా సుపారీ గ్యాంగులను దింపారని సమాచారం ఉందని కాకినాడలో జనసేన నేతలతో అన్నారు. కాబట్టి, జనసేన నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు జాగ్రత్తగా ఉండాలని, భద్రతా నియమాలను పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. శనివారం రాత్రి (జూన్ 17) కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి

జోరు పెంచిన కాంగ్రెస్.. బీజేపీని సైడ్ చేసిన బీఆర్ఎస్

కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ స్పీడ్ తగ్గితే... కాంగ్రెస్ దూకుడు పెరిగింది. రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ స్వరం కూడా మారింది. ఇలా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల వెనుక గల ఆంతర్యమేంటో ఆ వివరాలపై ఓ లుక్కేయండి. ఇంకా చదవండి

బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయం

గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నదని, తండాలకు, గుడాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన గిరిజన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా గిరిజన దినోత్సవాని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని HKGN గార్డెన్ లో ఐటిడిఏ అధ్వర్యంలో నిర్వహించిన గిరిజన సంబురాలలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇంకా చదవండి

సీఎం పదవి ముష్టి అడిగితే రాదు - పవన్‌కు మంత్రుల కౌంటర్ !

వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై మంత్రులు దాడిశెట్టి రాజా, సీదిరి అప్పలరాజు ఘాటు విమర్శలు చేశారు.  పవన్‌ తన నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని, గంటకో నిర్ణయం, పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. శనివారం వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడిన మంత్రులు.. పవన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంకా చదవండి

హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం

హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం కాసేపు కలకలం రేపింది.  శనివారం ఉదయం హైదరాబాద్‌లోని కేవీ రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాలలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వబోమని చెప్పడం వివాదానికి దారితీసింది. పలువురు ముస్లిం విద్యార్థినులు శుక్రవారం నిర్వహించిన డిగ్రీ ఉర్దూ మీడియం సప్లిమెంటరీ పరీక్షకు హిజాబ్‌ ధరించి వచ్చారు. అయితే. పరీక్షా కేంద్రంలోకి వారిని కాలేజీ సిబ్బంది అనుమతించడానికి నిరాకరించింది. హిజాబ్‌తో రావద్దని సూచించారు. అలా చెప్పడంతో విద్యార్థినులకు, కాలేజ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇంకా చదవండి

రూ.30 వేలకు మించి డిపాజిట్ చేస్తే అకౌంట్‌ ఫ్రీజ్‌ చేస్తారా?

మన దేశంలో, సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా ఓ విషయం వైరల్ అవుతోంది. బ్యాంక్‌  ఖాతాలో 30 వేల రూపాయల కంటే ఎక్కువ జమ చేస్తే, ఆ ఖాతాను తక్షణం మూసేస్తారన్నది విషయం తెగ తిరుగుతోంది. 30 వేల రూపాయలకు మించి ఒక అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తే, ఆ అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయమని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించారన్న మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌ మీకూ ఇప్పటికే వచ్చి ఉంటుంది. లేదో, ఇవాళో, రేపో మీ మొబైల్‌లోకి వచ్చి చేరుతుంది. ఇంకా చదవండి

సీతమ్మ గొంతు కోసినట్టు చూపిస్తారా? హనుమంతుడికి ఆ డైలాగ్‌లేంటి - ఆదిపురుష్‌పై రాజకీయ పార్టీల అసహనం

ఆదిపురుష్ సినిమాకి కలెక్షన్లు ఎంత భారీగా వస్తున్నాయో...అదే స్థాయిలో నెగిటివిటీ కూడా వస్తోంది. కేవలం వీఎఫ్‌ఎక్స్ గురించే కాదు. సినిమాలోని కొన్ని సీన్స్ పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. రావణుడిని చూపించిన విధానాన్నీ విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీ పని గట్టుకుని ప్రమోట్ చేసిన ఈ సినిమా మనోభావాల్ని దెబ్బ తీసిందని మండి పడుతున్నాయి. ఆమ్‌ఆద్మీపార్టీ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఈ సినిమా చూసిన తరవాత గుక్కపట్టి ఏడ్వాలనిపించిందని, అంతగా సీతారాములను అవమానించారని అన్నారు. శ్రీరాముడిని ఇలా చూపిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఇంకా చదవండి

‘కుదిరినప్పుడు రండి’ - ఏఏఏ సినిమాస్‌కు నాగబాబును ఆహ్వానించిన అల్లు అరవింద్!

ఏషియన్ సునీల్, అల్లు అర్జున్ భాగస్వామ్యంలో ఏఏఏ సినిమాస్ అనే మల్టీఫ్లెక్స్ ఇటీవలే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్‌కు నాగబాబును అల్లు అరవింద్ ఆహ్వానించారు. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్విటేషన్ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇంకా చదవండి

ఉస్మాన్ ఖవాజా సెంచరీ - యాషెస్ తొలి టెస్టులో ధీటుగా బదులిస్తున్న ఆసీస్

ఇంగ్లాండ్ తొలి రోజు దూకుడుకు  ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తున్నది. యాషెస్‌-2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న  తొలి టెస్టులో ఇంగ్లాండ్ తొలి రోజు 78 ఓవర్లలో 393 పరుగులు చేసి డిక్లేర్ ఇవ్వగా.. రెండో రోజు ఆసీస్  కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 311 పరుగులు సాధించింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా నిలకడగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా  (279 బంతుల్లో 126 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు  ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్సర్), అలెక్స్ కేరీ (80 బంతుల్లో 52 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్)ల  నిలకడైన ఆటతో ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. ఇంకా చదవండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget