అన్వేషించండి

Nagababu: ‘కుదిరినప్పుడు రండి’ - ఏఏఏ సినిమాస్‌కు నాగబాబును ఆహ్వానించిన అల్లు అరవింద్!

ఇటీవలే ప్రారంభించిన ఏఏఏ సినిమాస్ మల్టీఫ్లెక్స్‌కు మెగా సోదరుడు నాగబాబును అల్లు అరవింద్ ఆహ్వానించారు.

ఏషియన్ సునీల్, అల్లు అర్జున్ భాగస్వామ్యంలో ఏఏఏ సినిమాస్ అనే మల్టీఫ్లెక్స్ ఇటీవలే ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్‌కు నాగబాబును అల్లు అరవింద్ ఆహ్వానించారు. ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇన్విటేషన్ ఫొటోను కూడా షేర్ చేశారు.

ఈ పోస్టులో నాగబాబు, ‘కొత్తగా ప్రారంభం అయిన ఏఏఏ సినిమాస్‌కు నన్ను ఆహ్వానించినందుకు అల్లు అరవింద్‌కు ధన్యవాదాలు. మీ కుటుంబానికి, మన అల్లు అర్జున్‌కు శ్రేయోభిలాషిగా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కొత్త వెంచర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఏ పని తలపెట్టినా అది ఎంతో ఎత్తుకు చేరుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. నేను కచ్చితంగా ఒకసారి అక్కడికి వచ్చి ఆ థియేటర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తాను.’ అని తెలిపారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

అల్లు అర్జున్ నూతనంగా నిర్మించిన ఏఏఏ సినిమాస్ మల్టిప్లెక్స్ ను జూన్ 15వ తేదీన గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు. దానితో పాటు ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇవి చూసిన బన్నీ అభిమానులు ‘ఆల్ ది బెస్ట్’ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టాలీవుడ్ హీరోలు వరుసగా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతున్నారు. ఇప్పటికే మహేష్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబి అనే మల్టీప్టెక్స్ మొదలు పెట్టాడు. ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటిగా ఎదిగింది. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైపోయాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి తన సొంత ఊరు మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ ను నిర్మించాడు. ఇప్పటికే ప్రభాస్, వెంకటేష్, బాలకృష్ణ లాంటి హీరోలు కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. అదే ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఏఏఏ సినిమాస్ ను మొదలుపెట్టాడు అల్లు అర్జున్. దీనికోసం హైదరాబాద్ అమీర్ పేటలోని సత్యం థియేటర్ ఉన్న స్థలం లోనే ఈ మల్టిప్లెక్స్ నిర్మాణం జరిగింది. ఈ మల్టిప్లెక్స్ ను గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు. ఓపెనింగ్ కు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చాడు బన్నీ ‘ఈరోజు ఏఏఏ సినిమాస్ మల్టిప్లెక్స్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అద్బుతమైన సినిమా ఎక్స్పీరీయన్స్ కోసం ఏఏఏ అందరినీ ఆహ్వానిస్తుంది’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అత్యాధునిక హంగులతో ఈ ఏఏఏ మల్టిప్లెక్స్ ను నిర్మించారట. ఇందులో మొత్తం 5 స్క్రీన్ లు ఉన్నాయి. మొదటి స్క్రీన్ లో 67 అడుగుల ఎత్తు ఉంటుంది. డాల్బీ అట్మోస్‍ సౌండ్‍తో బార్కో లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇక సెకండ్ లో ఈపీఐక్యూ లక్సన్ స్క్రీన్‍గా ఉంది. డాల్బీ అట్మోస్ సౌండ్ ఉంటుంది. మిగిలిన మూడు స్క్రీన్లు 4కే ప్రొజెక్షన్‍ తో నడుస్తాయి. ఈ ఐదు థియేటర్లలో డాల్బీ 7.1 సౌండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూర్చొనే సీటింగ్ కూడా న్యూలుక్ తో కంఫర్ట్ గా డిజైన్ చేశారట. మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ మల్టిప్లెక్స్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget