అన్వేషించండి

Ashes 2023: ఉస్మాన్ ఖవాజా సెంచరీ - యాషెస్ తొలి టెస్టులో ధీటుగా బదులిస్తున్న ఆసీస్

యాషెస్ - 2023లో భాగంగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ ధీటుగా బదులిస్తున్నది.

Ashes 2023: ఇంగ్లాండ్ తొలి రోజు దూకుడుకు  ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తున్నది. యాషెస్‌-2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న  తొలి టెస్టులో ఇంగ్లాండ్ తొలి రోజు 78 ఓవర్లలో 393 పరుగులు చేసి డిక్లేర్ ఇవ్వగా.. రెండో రోజు ఆసీస్  కూడా అంతే ధీటుగా బదులిచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 311 పరుగులు సాధించింది. గడిచిన ఏడాదిన్నర కాలంగా నిలకడగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా  (279 బంతుల్లో 126 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు  ట్రావిస్ హెడ్ (63 బంతుల్లో 50, 8 ఫోర్లు, 1 సిక్సర్), అలెక్స్ కేరీ (80 బంతుల్లో 52 నాటౌట్, 7 ఫోర్లు, 1 సిక్స్)ల  నిలకడైన ఆటతో ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లారు. 

బ్రాడ్ డబుల్ స్ట్రోక్.. 

14 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోన స్టువర్ట్ బ్రాడ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.  11వ ఓవర్ వేసిన బ్రాడ్.. మొదటి బంతికి డేవిడ్ వార్నర్ (9)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వార్నర్‌ను  ఔట్ చేయడం బ్రాడ్‌కు ఇది 15వ సారి (అన్ని ఫార్మాట్లలో)  కావడం గమనార్హం.  ఆ మరుసటి బంతికే   వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ మార్నస్ లబూషేన్‌కు కూడా ఎదుర్కున్న ఫస్ట్ బాల్‌కే   ఔటయ్యాడు.  తక్కువ ఎత్తులో వచ్చిన బంతి.. లబూషేన్ బ్యాట్‌‌ను ముద్దాడుతూ  వికెట్ కీపర్  జానీ బెయిర్‌స్టో చేతిలో పడింది. 29కే  ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. 

ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన  స్టీవ్ స్మిత్ (59 బంతుల్లో 16)   కూడా ఎక్కువసేపు నిలువలేకపోయాడు.   ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ వేసిన  27వ ఓవర్లో ఆఖరి బంతికి స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు.   

ఆదుకున్న హెడ్ - ఖవాజా 

67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌తో సెంచరీ చేసిన హీరో ట్రావిస్ హెడ్‌ ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ పేస్‌కు కౌంటర్ అటాక్ ఇస్తూ.. వన్డే తరహా ఆట ఆడాడు.  మరోవైపు ఖవాజా కూడా  జోరు పెంచాడు.  ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు.  ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న  క్రమంలో రిటైర్మెంట్ నుంచి  బ్యాక్ వచ్చిన మోయిన్ అలీ.. ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.  అలీ వేసిన  46వ ఓవర్లో  మూడో బంతికి హెడ్.. జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

హెడ్ నిష్క్రమించినా  ఖవాజా.. కామెరూన్ గ్రీన్ (68 బంతుల్లో 38, 4 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు  72 పరుగులు జోడించారు.  ఈ జోడీని కూడా  అలీనే విడదీశాడు. 

 

ఖవాజా సెంచరీ.. 

సహచర ఆటగాళ్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ  సెంచరీ దిశగా సాగిన  ఖవాజా.. స్టోక్స్ వేసిన  69వ ఓవర్లో మూడో బంతిని ఆఫ్ సైడ్ దిశగా ఆడి   198 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టులలో ఖవాజాకు ఇది 15వ సెంచరీ కాగా ఇంగ్లాండ్ గడ్డపై మొదటిది. యాషెస్‌లో కూడా ఖవాజాకు ఇంగ్లాండ్ పై ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.   గ్రీన్ నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ అలెక్స్ కేరీ కూడా  నిలకడగా ఆడుతున్నాడు.  ఇప్పటికే అతడి అర్థ సెంచరీ పూర్తయింది.  ఇప్పటికే ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్.. 94 ఓవర్లలో 311 పరుగులు చేయగలిగింది.  ఇంకా తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు 82 పరుగులు వెనుకబడి ఉంది.   ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్, అలీ తలా రెండు వికెట్లు తీయగా  స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Embed widget