News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today: 

 

గదాయుద్ధం

పదేండ్ల తర్వాత  ఐసీసీ ట్రోఫీని అందుకోవాలనే తపన ఒకరిదైతే ప్రపంచ క్రికెట్‌పై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే పట్టుదల మరొకరిది.. ఈ నేపథ్యంలో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య  బుధవారం నుంచి ఐసీసీ వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరుగనుంది. తటస్థ వేదిక అయిన  ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ‘కెన్నింగ్టన్ ఓవల్’ ఇందుకు సిద్ధమైంది.  బుధవారం నుంచి ఇండియా - ఆస్ట్రేలియా మధ్య  మొదలుకాబోతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా  ఓవల్ పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంది..? రికార్డులు ఎలా ఉన్నాయి..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏం చర్చిస్తారు? ఏం చెబుతారు?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం అప్పుడే కనిపిస్తోంది.  ముఖ్యమంత్రి జగన్  ముందస్తుకు సిద్దమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తెలుగు దేశం  అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ ప్రభుత్వం పాలన పరమైన నిర్ణయాల్లో వేగం పెంచింది. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్దమయ్యారు. ఈ సమయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ ఈ కేబినెట్ భేటీ పై ఉత్కంఠ  ప్రారంభమయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రాగల మూడు రోజులు వర్షాలు

నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ గఢ్, పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ  సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (జూన్ 6) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ద్రోణి  విదర్భ నుంచి తెలంగాణ  మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు మంగళవారం (జూన్ 6న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బెయిల్‌పై పిటిషన్

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ మంజూరు చేసిన ముందస్తు బెయిల్ పై వైఎస్ సునీత రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  వివేకా కేసులో సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయన్నారు. అవినాష్ పై మోపిన అభియోగాలన్నీ తీవ్రమైనవి  సునీత రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ పై విచారణకు జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీపై సెటైర్లు

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటి అయిపోతుందని అప్పట్లో అందరూ అన్నారని, ఇప్పుడు రాష్ట్రంలో వెలుగు జిలుగులు ఉన్నాయని అన్నారు. ఆంధ్రాలో చిమ్మ చీకటి ఉంటే, తెలంగాణ వెలిగిపోతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కేసీఆర్ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అరెస్టులపై ఆగ్రహం

టీడీపీ నేతలను అడ్డుకోవడం లేదా, అరెస్టు చేయడం లేకపోతే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి పొద్దు గడవడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) విమర్శించారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్టు చేయడంపై చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నిమ్మల రామానాయుడును (Nimmala Ramanaidu) వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పే ప్లాన్

దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), దేశంలోని ప్రతి జనాభా వర్గానికి ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రకటిస్తుంటుంది. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లల చదువు, వివాహం, పదవీ విరమణ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తలుపుతట్టే ఖర్చుల కోసం ముందే ప్లాన్ చేసుకోవచ్చు, వ్యయాలకు చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇది సినిమా కాదు ఎమోషన్ 

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి తాజాగా తిరుపతిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ తన స్పీచ్ తో అదరగొట్టేశారు. ఇక ఈ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ.. "జైశ్రీరామ్, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? అని అడగగానే అభిమానుల నుంచి.. అరుపులు కేకలతో రెస్పాన్స్ చ్చింది. దీంతో ప్రభాస్ ‘‘ఓహో అయితే అదిరిపోయింది అన్నమాట. అయితే ఓపెనింగ్స్ అదిరిపోయినట్టే. సరిగ్గా ఏడు నెలల క్రితం మొదటిసారి 'ఆదిపురుష్' 3D టీజర్ ని నా ఫ్యాన్స్ కోసం వేయమని ఓమ్ రౌత్ ని అడిగాను. ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చూడమని అన్నాను. సో అలా ఫస్ట్ టైం 3డీలో మీరు టీజర్ చూశారు. చూసి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ మొత్తం టీం ని ఇక్కడదాకా నడిపించింది. ఇక ట్రైలర్ రిలీజ్ సమయంలో ఓం ఈ ట్రైలర్‌ను ఫ్యాన్స్ చూడాలని పట్టుబట్టాడు. వాళ్లు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్లే మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ తో మూవీ టీమ్ అంతా ఒక యుద్ధమే చేశారు. సుమారు 8 నెలలు నిద్రపోకుండా కేవలం గంట, రెండు గంటలు మాత్రమే పడుకుని ఒక్కొక్కరు సినిమా కోసం పది రెట్లు పని చేశారు’’ అని ప్రభాస్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆదిపురుష్‌ బిజినెస్ 

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ 3D టెక్నాలజీ తో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో టి సిరీస్ బ్యానర్ పై బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపిస్తున్న ఈ సినిమా కోసం ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి భారీ  రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక సినిమాలో ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

Published at : 07 Jun 2023 07:53 AM (IST) Tags: Breaking News Andhra Pradesh News Todays Top news Telangana LAtest News

ఇవి కూడా చూడండి

IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు

IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు

Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్

Top Headlines Today: నేడు బాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ర్యాలీ; తెలంగాణలో ఎన్నికల హడావుడి ఎందుకు లేదు? - నేటి టాప్ న్యూస్

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

ABP Desam Top 10, 24 September 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 24 September 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి