News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ గఢ్, పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ  సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (జూన్ 6) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ద్రోణి  విదర్భ నుండి  తెలంగాణ  మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతూ ఉంది.

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 41°C నుండి 43°C వరకు  స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టు ప్రక్కల జిల్లాలలో 39°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. 

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఖమ్మం నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో 3, 4, 5 రోజులు ఈ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ (3, 4జిల్లాల్లో) జిల్లాల్లో కూడా వడగాలులు వీచే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 49 శాతంగా నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
రేపు 12 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 218 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 31 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 260 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. మంగళవారం పశ్చిమగోదావరి  జిల్లా వరదరాజపురంలో 43.3°C, ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.9°C, ఏన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.7°C, అల్లూరి జిల్లా కొండైగూడెం,తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.6°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు.  17 మండలాల్లో తీవ్రవడగాల్పులు,  161 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు. 

• రేపు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 
• విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య ,చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40°C - 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 

Published at : 07 Jun 2023 07:00 AM (IST) Tags: Weather Updates Weather in Andhrapradesh Weather in Hyderabad weather in ap telangana Temperatures in Telangana Summer in hyderabad

ఇవి కూడా చూడండి

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!

Lokesh No Arrest : లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే - అన్ని కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Lokesh No Arrest :   లోకేష్‌కు అరెస్టు ముప్పు తప్పినట్లే  - అన్ని  కేసుల్లో అసలేం జరిగిందంటే ?

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన  రౌస్ అవెన్యూ కోర్ట్ !

Nara Bhuvaneswari : అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది - రైతులకు భువనేశ్వరి భరోసా !

Nara Bhuvaneswari :  అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది - రైతులకు భువనేశ్వరి భరోసా !

టాప్ స్టోరీస్

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం

Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం

Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?

Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?

Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి