తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ - ఎన్ని కోట్లో తెలుసా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ ముగిసినట్టు తెలుస్తోంది.
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ 3D టెక్నాలజీ తో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో టి సిరీస్ బ్యానర్ పై బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడిగా కనిపిస్తున్న ఈ సినిమా కోసం ఫాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక సినిమాలో ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
ఇప్పటికే సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉండగా తాజాగా ఆదిపురుష్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ సినిమాకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. తాజాగా ఆదిపురుష్ మూవీకి సంబంధించి సీడెడ్ మినహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా ముగిసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వరకు 'RRR' మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. దాని తర్వాత స్థానంలో అంటే రెండవ స్థానంలో 'ఆదిపురుష్' సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాదు త్రిబుల్ ఆర్ కంటే ముందు ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక రిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. తాజాగా ఆదిపురుష్ తో ప్రభాస్ తన రికార్డ్స్ ని తానే బీట్ చేశాడు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.213 కోట్ల బిజినెస్ జరగగా.. తాజాగా ఆది పురుష్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.155 కోట్ల బిజినెస్ జరిగింది.
ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రూ.60 కోట్లు, ఆంధ్ర రూ.70 కోట్లు అలాగే సీడెడ్ రూ.20 కోట్ల వరకు బిజినెస్ జరగనున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. కాగా మిగిలిన తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూ.30 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. టాలీవుడ్ ఆగనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సుమారు రూ.185 కోట్లకు ఆది పురుష్ ప్రీ రిలీజ్ థియెట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కాగా ఆదిపురుష్ మూవీ నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకోవాల్సి ఉంది. ఆయన కూడా మొదట్లో నైజాం రైట్స్ కోసం ఆసక్తిని చూపించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. చివరి నిమిషంలో వెనకడుగు వేశారు. దీంతో నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రిలీజ్ కి ముందే ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కి ఎలాంటి సక్సెస్ను అందిస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా 2D వెర్షన్ తో పాటు 3D లో కూడా రిలీజ్ అవుతుంది.
Also Read: ఆ లలితా జ్యువెలరీ దొంగ కథతో కార్తీ మూవీ? ‘జపాన్’ స్టోరీ ఇదేనట!