Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మంగళవారం (జూన్ 6న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మంగళవారం (జూన్ 6న) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.
ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు ఇలా చూసుకోండి..
స్టెప్-1: ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.-https://tsbie.cgg.gov.in/
స్టెప్-2: తర్వాత అక్కడ హోంపేజీలో కనిపించే 'Reverification /Recounting 2023' ఫలితాలకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. దాని కింద వేర్వేరుగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ లింక్స్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్-3: ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయగానే లాగిన్‌తో కూడిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్-4: లాగిన్ పేజీలో అభ్యర్థులు విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి.
స్టెప్-5: తర్వాత 'Get Data ' బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫలితాలు కంప్యూటర్ హోం స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్టెప్-6: ఫలితాల కాపీని ప్రింట్ తీసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
Reverification Results
Recounting Results
ఈ ఏడాది ఫస్ట్ ఇయర్‌లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో 67.26 శాతం మంది పాస్ అయ్యారు. ఇక ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్ పరీక్షలను మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్ 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది.
Also Read:
తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.ఈ ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2024 ఏప్రిల్ 23తో విద్యాసంవత్సరం ముగియనుంది.
కొత్త విద్యాసంవత్సరం క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..
పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్ 15, తెలంగాణ విద్యార్థులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..