Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది.
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
ఈ మేరకు పరీక్షల క్యాలెండర్‌కు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌కు, మోడల్ స్కూళ్ల డైరెక్టర్‌కు, ప్రభుత్వ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్‌కు, ఎస్‌ఐఈటీ డైరెక్టర్‌కు, గురుకుల విద్యాలయాల డైరెక్టర్‌కు, హైదరాబాద్, వరంగల్ రీజినల్ జాయింట్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అధికారులకు.. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీచేశారు.
తాజా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం...
➥ ఈ ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2024 ఏప్రిల్ 23తో విద్యాసంవత్సరం ముగియనుంది.
➥ ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
➥ 2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
➥ 2024 జనవరి 10న పదో తరగతి సిలబస్ పూర్తిచేసి, SSC బోర్డ్ ఎగ్జామినేషన్ లోపల రివిజన్ క్లాసులు, ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తిచేయనున్నారు.
➥ ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను 2024 ఫిబ్రవరి 29న పూర్తిచేసి, 2024 మార్చిలో జరగబోయే ఎస్‌ఏ-2 పరీక్ష కోసం రివిజన్, రెమెడియల్ టీచింగ్, ప్రిపరేషన్ నిర్వహించనున్నారు.
➥ ఈ ఏడాది అసెంబ్లీ అనంతరం అన్ని తరగతుల్లో 5 నిమిషాలపాటు యోగా సెషన్ కోసం కేటాయించనున్నారు. 2023 జూన్ 6 నుంచి 2023 జూన్ 9 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
➥ 2024 ఏప్రిల్ 24 నుంచి 2024 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. దసరా సెలవులు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఇంకా సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది.
పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-1 పరీక్షలను ఈ ఏడాది జులై 31 నాటికి నిర్వహించనున్నారు.
➥ ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నిర్వహించనున్నారు.
➥ సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11 వరకు, ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్ 12 లోపు, ఫార్మాటివ్ అసెస్‌మెంట్ (FA)-4 పరీక్షలను 2024 జనవరి 29 లోపు పూర్తిచేయనున్నారు.
➥ సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA)-2 పరీక్షలను 2024 ఏప్రిల్ 8 నుంచి 2024 ఏప్రిల్ 18 వరకు (1 నుంచి 9 తరగతులకు), ప్రీ ఫైనల్ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 29లోపు నిర్వహించనున్నారు.
➥ ఇక పదోతరగతి వార్షిక పరీక్షలను 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.
Also Read:
పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్ 15, తెలంగాణ విద్యార్థులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..