Top 5 Headlines Today: టీడీపీ బస్సు యాత్రకు బ్రేక్; విస్తారక్‌లతో బీజేపీ ప్లాన్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఎవరు దుష్మాన్ - ఎవరితో దోస్తాన్ !
ఎన్నికలు దగ్గర పడే వేళ.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. క్లియర్ అవతోంది. ఎవరు ఎవరికి దగ్గరగా జరుగుతున్నారో .. తెలుస్తూ ఉంది. బాహర్ మే కుస్తీ.. అందర్ మే దోస్తీ లా ఉండే తెలంగాణ పాలిటిక్సులో ఎవరు ఎవరి వైపు ఉన్నారో చెప్పడం కష్టం..ఎలక్షన్ కు నాలుగైదు నెలలు కూడా లేవు కాబట్టి ఇక బయట పడకతప్పదు. ఆ ఛాయలే భారత రాష్ట్ర సమితిలో బయట పడుతున్నాయని .. రాజకీయ పరిశీలకులు.. చెబుతున్నారు. ఇక ప్రతిపక్షం కాంగ్రెస్ ఎలాగో భాజపా-భారస ఒకటేనని భాజప్తా చెబుతోంది. ఇంకా చదవండి
అనంతపురం జిల్లాలో టీడీపీ బస్సు యాత్రకు బ్రేకులు
ముందుగానే మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీకి జిల్లాల్లో విబేధాలు సమస్యలుగా మారుతున్నాయి. అనంతపురం జిల్లాలో నేతల మధ్య సమస్యలు మరింత ఎక్కువయ్యాయి. బస్సుయాత్రలను కూడా క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.దంతో జిల్లాలో కొనసాగుతున్న వివాదాలపై టిడిపి అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గొడవులు జరుగుతున్న నియోజకవర్గాల్లోని నేతలను త్వరలో అమరావతికి పిలిపించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా చదవండి
అహ్మదాబాద్ నుంచి 600 మంది బలగం - తెలంగాణ బీజేపీ విస్తారక్ ప్లాన్!
అసెంబ్లి ఎన్నికలు దగ్గర పడడంతో తెలంగాణ బీజేపీ ప్రత్యేకంగా విస్తారక్‌లను రంగంలోకి దించింది. పోలింగ్ బూత్‌ల పరిధిలో బీజేపీని బలోపేతం చేసే బాధ్యత తోపాటు రాజకీయ వాస్తవ పరిస్థితులను విస్తారక్‌ల ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం అధ్యయనం చేయిస్తోంది. తమకు కేటాయించిన ఆయా మండలా ల్లోని బూత్ లకు విస్తారక్‌లు వెళ్లి అక్కడి పార్టీ కమిటీలతో సమా వేశం కానున్నారు. వారి పనితీరుపై పలు సూచనలు చేస్తారు. ఇందు కోసం ఆరు వందల మంది విస్తారక్‌లు తెలంగణకు వచ్చారు. అక్కడ్నుంచి తమకు కేటాయించిన ప్రదేశాలకు వెళ్లారు. ఇంకా చదవండి
బీజేపీ లీడర్ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్
లోలోపల కుమ్ములాటలకు కాలం చెల్లింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఎవరు ఎటో తేల్చుకునే టైం వచ్చింది. అందుకే ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలంతా బయటకు వస్తున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉంటున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ వైరల్‌గా మారుతోంది. తమ పార్టీ నేతలపై సెటైర్లు వేస్తూ ఆయన చేసిన పోస్ట్ ఉదయం నుంచి వైరల్‌గా మారుతోంది. ఇంకా చదవండి
విశాఖలో మరో రియల్టర్ కిడ్నాప్ కలకలం - పోలీసుల అదుపులో నలుగురు నిందితులు !
విశాఖలో రియల్టర్ కుటుంబం కిడ్నాప్‌నకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ అనే రియల్టర్‌తో పాటు ఆయన భార్య లోవ లక్ష్మిని కిడ్నాప్ చేశారు. విశాఖలో 4 వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులిద్దరూ కిడ్నాప్‌నకు గురయ్యారు. కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖకి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. ఇంకా చదవండి