Top Headlines Today: టీఎస్పీఎస్సీకి గడ్డు పరిస్థితి, వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
టీఎస్‌పీఎస్సీకి 'పరీక్ష' కాలం
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఒకే నెలలో ముఖ్యమైన పరీక్షలను నిర్వహిస్తుండటంతో.. తమకు అన్యాయం జరుగుతోందని, గ్రూప్-2 పరీక్ష వాయిదావేయాలని కొందరు అభ్యర్థులు కోరుతుండగా.. ఒకే పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మాత్రం పరీక్ష నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాలు విజ్ఞప్తులు చేస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే వీటిపై టీఎస్‌పీఎస్సీ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. గ్రూప్-2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున రెండురోజుల సమయం పడుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే గ్రూప్-2 పరీక్ష షెడ్యూలు ప్రకారమే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా చదవండి
వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల
దేవుడి దయ వల్ల ఈరోజు మహిళలకు మంచి చేసే వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బటన్ నొక్కి మరీ నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. నాలుగో విడదల నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశామన్నారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. ఇంకా చదవండి
రుషికొండకు వెళ్లే అన్ని దారులూ మూసేసిన పోలీసులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండలో ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పరిశీలించేదుకు వెళ్లే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం పవన్ రుషికొండకు వెళ్లాల్సి ఉంది. రషికొండ నిషేధిత స్థలం కాదని అయినా రుషికొండకు వెళ్లకుండా చెక్ పోస్ట్ పెట్టడం పోలీసులు అడ్డుకోవడం సరికాదని జనసేన పార్టీ స్పష్టం చేసింది. రాజ్యాంగ హక్కుతో...ప్రజలకోసం ఋషికొండ ను పర్యటనకు పవన్ వెళ్లాలని స్ట్రాంగ్ గా ముందుకెళ్తారని జనసేన ప్రకటించంది. అడ్డుకోవడానికి మీకు ఏం హక్కు ఉందని జనసేన నేతలు ప్రశ్నించారు. ఋషికొండ పై మాకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఒక బాధ్యత గల నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత గా కచ్చితంగా రుషికొండ కు వెళ్తారు... అడ్డుకోవలనుకుంటే...తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఋషికొండ పీపుల్స్ ల్యాండ్..ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి...ఆ అవసరం లేదన్నారు. ఇంకా చదవండి
ఢిల్లీలో షర్మిల - ఖర్గే, రాహుల్‌తో విలీనంపై చర్చలు జరిపే చాన్స్!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసే అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ అంశంపై చర్చలు పూర్తి చేశారు. హైకమాండ్‌తో తుది చర్చల కోసం షర్మిల ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా షర్మిల కలిసే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఆమె ట్వీట్లు పెడుతున్నారు. ఇంకా చదవండి
అతి త్వరలోనే క్రిస్ సిటీ తొలి దశ నిర్మాణం ప్రారంభం!
జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన భారీ పారిశ్రామిక నగరం అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతోంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా ఈ నగరాన్ని మూడు దశల్లో నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మొదటి దశ అభివృద్దికి పర్మిషన్ ఇచ్చింది. ఇంకా చదవండి