అన్వేషించండి

అతి త్వరలోనే క్రిస్‌ సిటీ తొలి దశ నిర్మాణం ప్రారంభం!

జగన్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన భారీ పారిశ్రామిక నగరం అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతోంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఈ నగరాన్ని మూడు దశల్లో నిర్మించడం జరుగుతుంది.

జగన్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన భారీ పారిశ్రామిక నగరం అభివృద్ధికి శ్రీకారం చుట్టబోతోంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా ఈ నగరాన్ని మూడు దశల్లో నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మొదటి దశ అభివృద్దికి పర్మిషన్‌ ఇచ్చింది.

కృష్ణపట్నం నోడ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏపీఐఐసీతో కలిసి క్రిస్‌ సిటీ  పేరుతో ఓ ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ క్రిస్ సిటీలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఈ సిటీలో భారీ పరిశ్రమలతో పాటు వాక్‌ టు వర్క్‌ విధానంలో అక్కడే నివాసముండేలా ఓ నగరాన్ని కూడా నిర్మాణం చేపట్టింది.

పరిశ్రమలతోపాటు అక్కడ ఉండే నివాస ప్రాంతానికి కూడా అత్యాధునిక వసతులు ఏర్పాటు చేస్తుంది. ఈ సిటీ మొత్తం 10,834.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతుంది. ముందు దశలో రూ.1,503.16 కోట్లతో సుమారు 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది.

ఈపీసీ విధానంలో క్రిస్‌ సిటీలో కీలక మౌలిక వసతుల కల్పనకు రూ. 1,021.41 కోట్ల విలువైన పనులకు ఏపీఐఐసీ త్వరలో టెండర్లు పిలవనుంది. 2022-23 ఎస్‌వోఆర్‌ ధరల ప్రకారం టెండర్లను పిలవనున్నట్లు అధికారులు మీడియాకి తెలిపారు. 

ఈ టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు కూడా పంపినట్లు చెప్పారు. ఈ టెండర్లలో కాంట్రాక్టు పొందిన సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఇక్కడ అవసరమైన మౌలిక వసతులన్నింటిని ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.

క్రిస్ సిటీలో మొత్తంగా 2,006 ఎకరాలు అందుబాటులో ఉండగా అందులో రహదారులుకు సుమారు 494 ఎకరాలు పోగా 2,006 ఎకరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 872.7 ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తే..మిగిలిన ప్రాంతాన్ని వివిధ వసతుల కోసం వినియోగిస్తామని అధికారులు తెలిపారు.

ఈ క్రిస్‌ సిటీ తొలి దశలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇందులో సుమారు 77,300 మంది అక్కడే నివాసం ఉంటూ  ఈ సిటీలోనే పని చేస్తారని అధికారులు వివరించారు. 

దీనికి అనుగుణంగా సుమారు 21 వేల కుటుంబాలు నివాసం ఉండేలా గృహ సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్ లు, స్కూల్స్, హాస్పిటల్స్, రవాణా వంటి సదుపాయాలను కూడా కల్పించనున్నారు. 3 సంవత్సరాలలో తొలి దశను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget