అన్వేషించండి

TSPSC: టీఎస్‌పీఎస్సీకి 'పరీక్ష' కాలం, గ్రూప్‌-2 వాయిదా వేయాలని కొందరు, వద్దంటూ మరికొందరు విజ్ఞప్తులు

తమకు అన్యాయం జరుగుతోందని, గ్రూప్-2 పరీక్ష వాయిదావేయాలని కొందరు అభ్యర్థులు కోరుతుండగా.. ఒకే పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మాత్రం పరీక్ష నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్నారు.

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఒకే నెలలో ముఖ్యమైన పరీక్షలను నిర్వహిస్తుండటంతో.. తమకు అన్యాయం జరుగుతోందని, గ్రూప్-2 పరీక్ష వాయిదావేయాలని కొందరు అభ్యర్థులు కోరుతుండగా.. ఒకే పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు మాత్రం పరీక్ష నిర్వహించాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో ఇరువర్గాలు విజ్ఞప్తులు చేస్తుండటంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే వీటిపై టీఎస్‌పీఎస్సీ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. గ్రూప్‌-2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ స్పందించింది. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ అందుబాటులో లేనందున రెండురోజుల సమయం పడుతుందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే గ్రూప్-2 పరీక్ష షెడ్యూలు ప్రకారమే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

గ్రూప్-2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్షల షెడ్యూలును కమిషన్ ఆరు నెలల క్రితమే ప్రకటించింది. మరోవైపు, ఆగస్టులో గురుకుల పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో గురుకుల, గ్రూప్-2 పోస్టులు రెండింటికీ దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. వాటిలో ఏదో ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేయాలంటూ గురువారం కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు, పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని కమిషన్ సహాయ కేంద్రానికి మరికొందరు అభ్యర్థులు విజ్ఞప్తులు పంపించారు. పరీక్ష కోసం ఉద్యోగాలకు సెలవులు పెట్టామని, రాజీనామా చేశామని.. ఎనిమిది నెలలుగా సన్నద్ధమవుతున్నామని వారు చెబుతున్నారు. కాగా, గ్రూప్-2 పరీక్షలను షెడ్యూలు ప్రకారమే నిర్వహించేందుకు కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన విద్యాసంస్థలకు సెలవులూ ప్రకటించింది. వాయిదా వేస్తే భవిష్యత్తులో పరీక్ష తేదీలు దొరకడం కష్టమని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి.

హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..
తెలంగాణలో 'గ్రూప్‌-2' పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ డి.మహేశ్‌తో పాటు 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల నియామక బోర్డు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ఉన్నందువల్ల.. గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ALSO READ:

'గ్రూప్‌-2' అభ్యర్థుల సమస్య ఏంటీ? అసలు పరీక్ష వాయిదా ఎందుకు కోరుతున్నారు? కారణాలివే!
గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ బోర్డు అధికారులకు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. గ్రూప్-2 వాయిదాపై బోర్డు అధికారులు రెండు రోజుల సమయం అడిగారు. అయితే బోర్డు చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. దీంతో బోర్డు అధికారులు బోర్డుపై నమ్మకంలేదు.. చైర్మన్‌ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

హైకోర్టుకు 'గ్రూప్‌-2' అభ్యర్థులు, పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్లు
తెలంగాణలో 'గ్రూప్‌-2' పరీక్ష వాయిదా వేయాలని ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు 'గ్రూప్‌-2' పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆగస్టు 9, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-2ను రీషెడ్యూల్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కన్నుమూత
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Ambedkar Row in Parliament: మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు
Child Constable: ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?
Embed widget