అన్వేషించండి

CM Jagan: వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల - చంద్రబాబుకు సెక్యూరిటీ ఎందుకని జగన్ ప్రశ్న

CM Jagan: రాష్ట్రంలోని కోటి 5 లక్షల మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థఆయిలో విమర్శలు చేశారు.

CM Jagan: దేవుడి దయ వల్ల ఈరోజు మహిళలకు మంచి చేసే వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బటన్ నొక్కి మరీ నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. నాలుగో విడదల నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశామన్నారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని అన్నారు. గత సర్కారు బకాయిలు పెట్టి డబ్బును తాము చెల్లించామని చెప్పారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకలు మోసపోయారని ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు 2016లో చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు. ఇంత మంచి పథకాలను గత ప్రభుత్వలా హయాంలో అసలు చూసైనా ఉండరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందని అని ప్రశ్నించారు. మీ బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఆలోచించారా అని అడిగారు. అలాగే పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బడులు పెడితే అడ్డుకోవాలని చూశారని, పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని చెప్పారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని విమర్శించారు. 

చంద్రబాబు గనుక మరోసారి సీఎం అయితే ప్రజలకు ఏమాత్రం మంచి జరగదని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తారని, అందుకే ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించారన్నారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారన్నారు. అలాగే మొన్నటి పుంగనూరు ఘటన గురించి తెలిసి తాను చాలా బాధ పడినట్లు వెల్లడించారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలనిపించిందని చెప్పారు. ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని ఇంకో రూట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. 47 మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేశారని.. ఓ పోలీసు అయితే కన్నే పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని ఆరోపించారు. మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు ఏమాత్రం బాగుండాలనుకున్న చంద్రబాబుకు ఓటు వేయొద్దని వివరించారు. 

పేద అక్కచెల్లెమ్మలకు సాధికార కల్పిస్తూ, వారు చేస్తున్న వ్యాపారాలకు చేయూతనిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలు తమ సర్కారు మెరుగు పరుస్తుందని చెప్పుకొచ్చారు. అమలాపురం చేరుకున్న సీఎం జగన్.. వైఎస్ఆర్ సున్నా వడ్డీ జమ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు అనంతరం సున్నావడ్డీ పథకం లబ్ధిదారులతో కలిసి ఫొటో దిగారు. 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
2027 డిసెంబర్ 9లోపు ఉస్మానియా, అల్వాల్‌, ఎల్బీనగర్‌, వరంగల్‌ ఆస్పత్రులు పూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget