అన్వేషించండి

Bengal Assembly Elections: బెంగాల్ పోరులో శక్తి స్వరూపాలు- అరాచకంపై సామాన్యుల సమరభేరి - ఈ ముగ్గురు ఎమ్మెల్యేలది చరిత్ర!

victims won as BJP MLAs: బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీనికి కారణం వారు అత్యంత సామాన్యులు కావడమే.

Three ordinary women victims won as BJP MLAs:  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఒక చారిత్రాత్మక మలుపుకు వేదికైంది. ధనబలం, అంగబలం, అధికార గర్వం ఉప్పెనలా విరుచుకుపడినా.. సామాన్య మహిళల సంకల్పం ముందు అవి తలవంచక తప్పలేదు. రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం బాధితుల పక్షాన నిలబడి, వ్యవస్థలోని అన్యాయాన్ని ఎదిరించిన ముగ్గురు మహిళలు ఈ ఎన్నికల్లో  నారీ శక్తి కి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచారు. సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖా పాత్ర, ఆర్జీ కర్ బాధితురాలి తల్లి రత్న దేబ్‌నాథ్, శ్రమజీవి కలితా మాఝీ సాధించిన విజయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

సందేశ్‌ఖాలీ గళం.. అసెంబ్లీలో ప్రతిధ్వని 

సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అరాచకాలకు వ్యతిరేకంగా మొట్టమొదట గళమెత్తిన ధీరవనిత రేఖా పాత్ర . కేవలం ఒక సాధారణ గృహిణిగా ఉంటూ, అధికార పార్టీ నాయకుల అకృత్యాలను ఎండగట్టిన ఆమె ప్రయాణం అసాధారణం. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రేఖను అణచివేయడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆమె వెనకడుగు వేయలేదు.  సుమారు 5,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి, అణచివేతకు గురైన వేలాది మంది మహిళల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారు. 

న్యాయం కోసం మాతృమూర్తి పోరాటం - రత్న దేబ్‌నాథ్ 

ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై అలుపెరుగని పోరాటం చేసిన  రత్న దేబ్‌నాథ్ , కేవలం బాధితురాలి తల్లిగా మిగిలిపోకుండా ప్రజల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. అధికార యంత్రాంగం సాక్ష్యాలను తారుమారు చేస్తోందన్న ఆరోపణల మధ్య, ఆమె ప్రజల కోర్టులో న్యాయం కోరారు. అధికార పార్టీ అభ్యర్థిపై 28,000 ఓట్ల భారీ మెజారిటీ  సాధించడం బెంగాల్ రాజకీయాల్లో ఒక ప్రకంపన.  ఈ గెలుపు కేవలం రాజకీయ విజయం కాదు, వ్యవస్థలోని కుళ్లుపై ప్రజలు వేసిన బలమైన చెంపదెబ్బ అన్న అభిప్రాయం సామాన్యుల్లో వినిపిస్తోంది. 

కష్టజీవి   కలితా మాఝీ ఇప్పుడు ఎమ్మెల్యే

ఇళ్లలో పనిమనిషిగా జీవనం సాగించే  కలితా మాఝీ ప్రస్థానం ఒక స్ఫూర్తి పాఠం. రాజకీయ వర్గాల బెదిరింపులకు భయపడకుండా, తనను ఉపాధికి దూరం చేసిన శక్తులపైనే ఆమె గెలిచి చూపించారు. పనిమనిషిగా ఉంటూనే ప్రజాప్రతినిధిగా ఎదగడం ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని చాటిచెప్పింది. 12,000 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించిన కలిత, కష్టజీవుల గళాన్ని చట్టసభలకు తీసుకెళ్లబోతున్నారు. అధికార మదంతో సామాన్యులను అణచివేయలేరని కలిత విజయం స్పష్టం చేసింది.   

 
ప్రజాస్వామ్య విజయం! 

ముగ్గురు మహిళల గెలుపు బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. భయం రాజ్యమేలుతున్న చోట ధైర్యం తోడైతే, సామాన్యులు సైతం అజేయమైన శక్తులుగా మారుతారని ఈ ఫలితాలు చాటుతున్నాయి.  ఓటు  అనే ఆయుధంతో సామాన్య పౌరుడు ఎంతటి విప్లవాన్నైనా తీసుకురాగలడనే నిజాన్ని ఈ  బెంగాల్ యోధులు నిరూపించారు. రేఖా పాత్ర, రత్న దేబ్‌నాథ్ , కలితా మాఝీ.. ఈ ముగ్గురూ భారతీయ జనతా పార్టీ తరపునే పోటీ చేసి విజయం సాధించారు.                   

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 13 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
Breaking News: అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం-

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget