అన్వేషించండి

Three Indians: దేశాధ్యక్షుడు... ముగ్గురు భారతీయులు... చెప్పుల షాపు... అచ్చం క్రాక్‌ మూవీ లాంటి స్టోరీ...

ఓ ముగ్గురు భారతీయులు ఏకంగా ఓ మాజీ దేశాధ్యక్షుడినే జైలుపాలయ్యేలా చేశారు . సౌతాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా ఆ ముగ్గురి వల్ల ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. అసలు ఆ కథేంటి?

ముగ్గురు భారతీయులు.. సౌతాఫ్రికా అధ్యక్షుడు.. ఓ చెప్పుల షాపు

ఏంటి ఏం అర్థం కావట్లేదా? అసలు ఈ మూడింటికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా?

కానీ ఈ మూడింటికి ఓ లింకు ఉంది. దాని వెనుక సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించే కథ ఉంది.

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలు పాలు అయ్యారు. అయితే ఇందులో మన భారతీయ అన్నదమ్ములు (గుప్తా బ్రదర్స్) దే కీలక పాత్ర. రాజకీయం, అవినీతి దోస్తానా చేస్తే వ్యక్తులు, వ్యవస్థలకు ఏమవుతుందనటానికి ఈ కథే ఓ ఉదాహరణ.

చెప్పుల షాపు..

శివకుమార్ గుప్తా.. ఉత్తర్ ప్రదేశ్ లోని మారుమూల సహరన్ పుర్ లో ఓ చిన్న రేషన్ షాపు డీలర్. కానీ అతని ఆశలన్నీ ఆకాశం వైపే ఉండేవి. ఆయన కుమారులు అజయ్, అతుల్, రాజేశ్. 1990ల ఆరంభంలో అజయ్ దిల్లీలో కంప్యూటర్ పరికరాల దిగుమతి వ్యాపారం చేసేవాడు. రెండో అబ్బాయి అతుల్ 1993లో దక్షిణాఫ్రికా వెళ్లి ఓ చెప్పుల షాపు పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఆ కుటుంబం దశ తిరిగిపోయింది. జొహెన్నస్ బర్గ్ లో చెప్పుల దుకాణంతో మొదలైన అతుల్.. కంప్యూటర్ పరికరాలను తీసుకువచ్చి అసెంబ్లింగ్ చేసి అమ్మటం మొదలుపెట్టాడు. మెల్లగా మండేలా పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్ సీ)  నేతలతో సంబంధాలు మొదలయ్యాయి. 

ఓసారి భారత్ కు వచ్చినప్పుడు.. మండేలా డిప్యూటీ థాబో ఎంబెకీ (మండేలా తర్వాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారీయన) సహచరుడు ఎసోప్ పహాద్ తో పరిచయమైంది. ఆ పరిచయంతో గుప్తా కుటుంబం దక్షిణాఫ్రికాను దున్నటానికి బీజాలు పడ్డాయి. దక్షిణాఫ్రికాకు స్వాతంత్ర్యం వచ్చినా.. ఆర్థిక వ్యవస్థ అంతా ఇంకా తెల్లజాతి వ్యాపారస్థుల చేతుల్లోనే ఉండేది. దాంతో నల్లజాతి నేతలు భారత్, చైనా లాంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవటానికి ఇష్టపడ్డారు. దీన్ని గుప్తా బ్రదర్స్ అవకాశంగా వాడుకున్నారు. ఎంబెకి అధ్యక్షుడయ్యాక పహాద్ ద్వారా అజయ్ గుప్తా దగ్గరయ్యారు. ప్రభుత్వ కాంట్రాక్టులతో మొదలైన వారి వ్యాపారం యురేనియం గనుల్లోకి ప్రవేశించింది. అధ్యక్షుడి ఇంట్లో పార్టీకి గుప్తా బ్రదర్స్ ఉండాల్సిందే.

అధ్యక్షుడిని ముంచేసి..

ఓవైపు ఎంబెకీతో చనువుగా ఉంటూనే ఆయన ప్రత్యర్థి పార్టీలో నం-2 జుమాతోనూ గుప్తా బ్రదర్స్ సన్నిహిత సంబంధాలు కొనసాగాయి. జుమా అధ్యక్షుడిగా అధికారం చేపట్టగానే గుప్తాల రేంజే పెరిగిపోయింది. జుమాతో పాటు ఏఎన్ సీ సీనియర్ నేతల కొడుకులను కూడా తమ వ్యాపారాల్లో భాగస్వాములను చేశారు. కాంట్రాక్టులు, వ్యాపారాల నుంచి ఏకంగా కేబినెట్ లో ఎవరుండాలో ఎవరు వద్దో నిర్ణయించే స్థాయికి గుప్తా బ్రదర్స్ ఎదిగిపోయారు. అధ్యక్ష భవనం దాదాపు వీరి చేతుల్లోకి వచ్చేసింది. 2015లో గుప్తాలు చెప్పిన మనిషిని ఎలాంటి అనుభవం లేకున్నా ఆర్థిక మంత్రిని చేశారు జుమా. ఇలా గుప్తా బ్రదర్స్ అవినీతికి జుమా రాజకీయం తోడై దక్షిణాఫ్రికా ఆర్థిక స్థితి దారుణంగా తయారైంది. ఇది జుమా పదవికి ఎసరు తెచ్చింది.

పార్టీలో జుమా పరిస్థితి బలహీనపడటంతో గుప్తా బ్రదర్స్ కు కూడా కష్టకాలం మొదలైంది. అదే సమయంలో ఓ మిలటరీ బేస్ వద్ద తమ కుటుంబ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు వీరు. ఈ వేడుకకు భారత్ నుంచి విమానాల్లో బంధుమిత్రుల్ని తీసుకొచ్చి హై రేంజ్ లో చేశారు. అక్కడ నుంచి వారి పతనం మొదలైంది. దేశంలోని పౌర సంఘాలు, విపక్షాలు, మీడియా.. గుప్తా బ్రదర్స్ అవినీతిని, జుమా తప్పులను బయటపెట్టాయి. గుప్తా బ్రదర్స్ నుంచి బ్యాంకులు దూరం జరిగాయి. అవినీతి వ్యతిరేక వ్యవస్థలు వెంటపడ్డాయి. జొహెన్నస్ బర్గ్ స్టాక్ ఎక్స్చేంజీ నుంచి గుప్తా బ్రదర్స్ కంపెనీలను డీలిస్ట్ చేశారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితి. రాజకీయంగా తన పరిస్ఖితి బాలేదని గుర్తించిన జుమా దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వెంటనే ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు గుప్తా బ్రదర్స్ కంపెనీలపై దాడులు చేశాయి. కానీ కొద్దిరోజుల ముందే అన్నీ సర్దుకొని గుప్తా బ్రదర్స్ దుబాయ్ విమానమెక్కేశారు. వారితో కలిసి అవినీతికి పాల్పడినందుకు మాజీ అధ్యక్షుడు జుమా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదీ ముగ్గురు భారతీయుల వలన జైలు కెళ్లిన మాజీ అధ్యక్షుడి కథ.

టాప్ హెడ్ లైన్స్

PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget