Monkey in Karnataka: పగ తీర్చుకోవడానికి ఈ కోతి 22 కిలోమీటర్లు నుంచి వచ్చింది... కర్ణాటకలో వింత ఘటన
ఓ కోతి తనను పట్టించిన వ్యక్తి పై పగ తీర్చుకునేందుకు ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
![Monkey in Karnataka: పగ తీర్చుకోవడానికి ఈ కోతి 22 కిలోమీటర్లు నుంచి వచ్చింది... కర్ణాటకలో వింత ఘటన This Monkey in Karnataka Travelled 22 Km to Take 'Revenge' From Villagers Monkey in Karnataka: పగ తీర్చుకోవడానికి ఈ కోతి 22 కిలోమీటర్లు నుంచి వచ్చింది... కర్ణాటకలో వింత ఘటన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/25/4ce6237127c45485ddab6e9dfb80cb37_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కొన్ని జంతువులు పగ పడతాయని తెలుసు... ఆ పగ తీర్చుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి, ఎన్ని సంవత్సరాలైనా వేచి చూస్తాయి. తాజాగా ఓ కోతి తనను పట్టించిన వ్యక్తి పై పగ తీర్చుకునేందుకు ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగెహరా గ్రామంలో ఓ మగ కోతి ఐదు సంవత్సరాలుగా అక్కడే జీవనం సాగిస్తోంది. అయితే, ఇది ఫ్రూట్స్, స్నాక్ ప్యాకెట్లను ఎత్తుకుపోయేతి. కోతి స్వభావమే ఇది కదా అని గ్రామస్థులు అంతగా పట్టించుకోలేదు. ఆ గ్రామంలో కొద్ది రోజులు క్రితం పాఠశాలలు రీ ఓపెన్ చేశారు. కోతి పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో ఓ వ్యక్తి ఫారెస్ట్ డిపార్టుమెంట్ వారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు
దీంతో ఈ కోతిని పట్టుకునేందుకు సెప్టెంబర్ 16న అటవీ శాఖ రంగంలోకి దిగింది. దాన్ని పట్టుకునేందుకు స్థానికులు, ఆటోడ్రైవర్ల సాయం కోరారు. ఆటో డ్రైవర్ జగదీశ్ అటవీ సిబ్బందికి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. అందరూ కలిసి కోతిని పట్టుకునేందుకు ఓ ఐడియా వేశారు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం జగదీశ్... కోతిని రెచ్చకొట్టేందుకు ప్రయత్నించాడు. కోతికి కోపమొచ్చి అతడిపై దాడి చేసింది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో జగదీశ్ గాయపడ్డాడు. 30 మంది సాయంతో అటవీ శాఖ సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి కోతిని పట్టుకున్నారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి 22కి.మీ దూరంలో ఉన్న బలూర్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్థులంతా ఊపిరి పీల్చుకున్నారు.
కోతి కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలైన కథ ఇప్పుడే ప్రారంభమైంది. ఆ కోతి... ఆటో డ్రైవర్ జగదీశ్ పై పగపట్టింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని సమయం కోసం ఎదురుచూసింది. అలా కొన్ని రోజులకు కోతి... అడవి నుంచి తప్పించుకుని ట్రక్కు ఎక్కి 22 కిలోమీటర్లు ప్రయాణించి మరీ తిరిగి ఆ గ్రామానికి వచ్చింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ నోటా ఈ నోటా ఈ కోతి తిరిగి వచ్చిందన్న విషయం జగదీశ్ వరకు వెళ్లింది. దీంతో ఒక్కసారిగా జగదీశ్ షాకయ్యాడు. తన మీదే పగ తీర్చుకోవడానికి కోతి వచ్చిందని భావించి ఇంటి నుంచి బయటికి రాలేదు. మరోసారి అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన సిబ్బంది ఆ కోతిని పట్టుకున్నారు. అయితే, ఈ సారి బలూర్ అటవీ ప్రాంతంలో కాకుండా ఇంకా దూరంలో ఉన్న మరో అటవీ ప్రాంతంలో దాన్ని వదిలిపెట్టారు. మరి, కోతి ఇక తన పంతాన్ని వదులుకుంటుందో... మళ్లీ జగదీశ్ కోసం తిరిగి వస్తుందో?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)