News
News
X

Rahul Gandhi Update: నేను, గాంధీ హిందువులం.. మీరూ, గాడ్సే హిందుత్వవాదులు: రాహుల్ గాంధీ

హిందూ, హిందుత్వవాది మధ్య తేడా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను హిందువునని, హిందుత్వవాదిని కాదన్నారు.

FOLLOW US: 
Share:

నరేంద్ర మోదీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ధరల పెరుగుదలను నిరసిస్తూ రాజస్థాన్ జైపుర్​లో కాంగ్రెస్​ నిర్వహించిన ర్యాలీలో హిందూ, హిందుత్వవాది మధ్య చాలా తేడా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ర్యాలీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

" నేటి భారత రాజకీయాల్లో హిందూ, హిందుత్వవాది అనే రెండింటి మధ్య పోటీ నడుస్తోంది. ఆ రెండు పదాలకు వేరువేరు అర్థాలు ఉన్నాయి. నేను హిందువును.. హిందుత్వవాదిని కాదు. మహాత్మాగాంధీ హిందువు, గాడ్సే హిందుత్వవాది.  హిందుత్వవాదులు అధికారం కోసమే తమ జీవితాంతం ఆరాటపడతారు. వారికి అధికారం కన్నా ఏదీ ఎక్కువ కాదు. దాని కోసం ఏదైనా చేస్తారు. వారు సత్తాగ్రహ్​ దారిని అనుసరిస్తారు. సత్యాగ్రహాన్ని కాదు. ఈ దేశం హిందువులది, హిందుత్వవాదులది కాదు. హిందువు అంటే ఎవరు? ప్రతి ఒక్కరిని ప్రేమించి, ఎవరికీ భయపడకుండా, అన్నీ మతాలను గౌరవించేవారే నిజమైన హిందువులు. హిందుత్వవాదులకు అధికారమే కావాలి. 2014 నుంచి వాళ్లే అధికారంలో ఉన్నారు. అలాంటి హిందుత్వవాదులను పక్కకి తోసి హిందువులను అధికారంలోకి తీసుకురావాలి.                                         "
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఏం చేశారు?

మోదీ ప్రభుత్వం 7 ఏళ్ల పాలనలో ఏం చేసిందో చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. కాంగ్రెస్​ పార్టీ 70 ఏళ్లలో నిర్మించిన వాటిని తన పారిశ్రామిక స్నేహితులకు అమ్మేయాలని మోదీ చూస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ ర్యాలీ సోనియా గాంధీ ప్రసంగిచలేదు. అయితే ఆమె మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.

Also Read: Bipin Rawat Demise: 'బిపిన్ రావత్ చివరి సందేశం ఇదే.. ఆ మాటల్లో కూడా దేశం గురించే'

Also Read: Omicron Cases In India: దేశంలో 36కు చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్‌లో తొలి కేసు నమోదు

Also Read: US Tornado: టోర్నడో ధాటికి అమెరికా కకావికలం.. 80 మంది వరకు మృతి

Also Read: Viral Video India 2021: 'ఏం చేస్తిరి ఏం చేస్తిరి.. దుమ్మురేపారు కదరా'.. ఈ ఏడాది ఇవే తోపు వీడియోలు!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,774 మందికి కరోనా.. 560 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి

Also Read: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి

Also Read:  విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే

Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!

Also Read: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Dec 2021 07:06 PM (IST) Tags: CONGRESS rahul gandhi sonia gandhi Rajasthan Jaipur Priyanka Gandhi Vadra ashok gehlot Congress Jaipur Rally

సంబంధిత కథనాలు

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

నిజామాబాద్ జిల్లాకు గోల్డ్‌ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం

LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

LPG Cylinder Subsidy:  పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల