Best Winter Destinations : కాలుష్యానికి బ్రేక్ ఇచ్చి వీకెండ్లో వెళ్లాల్సిన కూల్ ప్రదేశాలు ఇవే.. ఢిల్లీకి దగ్గర్లోని బెస్ట్ వింటర్ స్పాట్స్
Winter Weekend Trips : చలికాలంలో ట్రిప్‌కి వెళ్లాలనుకున్నా.. మానసికంగా డీటాక్స్ అవ్వాలి అనుకున్నా.. ప్రకృతిలో విహరించాలి అనుకుంటే మీరు కచ్చితంగా ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ఈ ప్రదేశాలు చుట్టేయండి.

Weekend Escapes Close to Delhi : శీతాకాలం ప్రారంభం అయింది. అలాగే వీకెండ్ కూడా దగ్గర్లో ఉంది. ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వెళ్దామంటే కాలుష్యం కోరలు చాపి కూర్చొంది. కానీ మీరు ఢిల్లీకి దగ్గర్లోని కొన్ని ప్రదేశాలు చుట్టేయవచ్చు. పర్యావరణాన్ని ఇష్టపడేవారికి ఇవి మంచి ఆప్షన్. ఢిల్లీకి దగ్గర్లో ఉండేవాళ్లు.. లేదా ఢిల్లీలో ఉండేవారు వీకెండ్లో కాలుష్యం నుంచి దూరంగా ఉండాలనుకుంటే ఏ ప్రదేశాలు (Best Winter Destinations) అనువైనవో.. అక్కడ ఎలాంటి యాక్టివిటీలు చేయవచ్చో చూసేద్దాం.
లాన్స్‌డౌన్, ఉత్తరాఖండ్ – ఢిల్లీ నుంచి సుమారు 270 కి.మీ
ప్రశాంతతకు ఒక ఇల్లు ఉంటే.. అది లాన్స్‌డౌన్. ఇది పర్యాటకం ఎక్కువగా లేని ఒక కంటోన్మెంట్ సిటీ. దట్టమైన పైన్, ఓక్ అడవులు వాలులను కప్పేస్తాయి. సహజంగానే గాలిని ఫిల్టర్ చేస్తాయి. తక్కువ ట్రాఫిక్, ఆర్మీ-నియంత్రిత పరిశుభ్రత ప్రదేశం ఇది. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. టిప్-ఎన్-టాప్ వ్యూపాయింట్ లవర్స్ లేన్ ఫారెస్ట్ ట్రయల్, భుల్లా తాల్ సరస్సు, పాత వలసవాద చర్చిలను చూడవచ్చు.
కసౌలి, హిమాచల్ ప్రదేశ్ – ఢిల్లీ నుంచి సుమారు 290 కి.మీ
కసౌలి ఉత్తర భారతదేశంలోని అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్లలో ఒకటిగా ఉంది. దేవదారు చెట్లతో కప్పబడిన కొండలు, స్లో వెదర్, స్వచ్ఛమైన పర్వత గాలులు మీకు పరిపూర్ణమైన డీటాక్స్ ప్రదేశంగా హెల్ప్ చేస్తుంది. దట్టమైన కోనిఫర్‌ల మధ్య స్టే చేయవచ్చు. మంకీ పాయింట్, క్రైస్ట్ చర్చి, గిల్బర్ట్ ట్రయల్, సన్ సెట్ స్పాట్స్ విజిట్ చేయవచ్చు.
ధనౌల్టి, ఉత్తరాఖండ్ – ఢిల్లీ నుంచి 300 కి.మీ
మసూరీకి ఎగువన ఉన్న ధనౌల్టి నిశ్శబ్దంగా, శుభ్రంగా, వాణిజ్యపరంగా తక్కువగా ఉంటుంది. దేవదారు, ఆల్పైన్ చెట్ల వాసన గాలిలో నిండి ఉంటుంది. రాత్రి ఆకాశం నక్షత్రాల దుప్పటిలా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మీరు ఎత్తైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి మధ్యలో క్యాంపింగ్, వాకింగ్, గ్రామాలు, సుర్కందా దేవి ట్రెక్లను ఎంజాయ్ చేయవచ్చు.
నౌకుచియాతల్ & నైనిటాల్ ప్రాంతం - ఢిల్లీ నుంచి సుమారు 310 కి.మీ
నైనిటాల్ నగరంలో ఎక్కువ పర్యాటకులు ఉన్నప్పటికీ.. నౌకుచియాతల్, భీమ్‌తాల్ వంటి సమీప సరస్సు పట్టణాలు ప్రశాంతమైన పరిసరాలను, గణనీయంగా తాజాగా ఉండే గాలిని అందిస్తాయి. సరస్సు పర్యావరణ వ్యవస్థ, పరిసర కొండలు సహజంగా శుద్ధి చేసిన వాతావరణాన్ని ఇస్తాయి. పక్షులను చూడటం, బోటింగ్, పారాగ్లైడింగ్ చేయవచ్చు. స్నో వ్యూ కేబుల్ కార్, బ్యూటీఫుల్ లేక్ సైడ్ వాక్స్ ఎంజాయ్ చేయవచ్చు.
రిషికేశ్, ఉత్తరాఖండ్ - ఢిల్లీ నుంచి 240 కి.మీ
రిషికేశ్ ఒక ఆధ్యాత్మిక ప్రదేశం కంటే ఎక్కువ. హిమాలయాల దిగువన ఉన్నందున.. తపోవన్, నదీ తీర ప్రాంతాలలో స్పష్టమైన, శుభ్రమైన గాలిని అందిస్తుంది. పర్వత గాలులు, నదీ తీర పర్యావరణం, ప్రారంభ శీతాకాలపు తాజాదనం, తక్కువ కాలుష్య వనరులు అబ్బో చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఢిల్లీ నుంచి ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఇది అనువైనది. ఇక్కడ మీరు డివోషనల్ టచ్ కోసం యోగా రిట్రీట్‌లు, గంగా హారతి, నదీ తీర కేఫ్‌లు, తేలికపాటి ట్రెక్కింగ్, ఫారెస్ట్ వాక్స్ ఎంజాయ్ చేయవచ్చు.
కనతల్, ఉత్తరాఖండ్ - ఢిల్లీ నుంచి సుమారు 320 కి.మీ
చంబా, ధనౌల్టి మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం కనతల్. పూర్తిగా నిశ్శబ్దం కోరుకునే వారికి ఇది అద్భుతమైన ప్రదేశం. గాలులు శుభ్రంగా, వేగంగా వీస్తూ ఉంటాయి. ఆకాశం స్పష్టంగా ఉంటుంది. అడవులు స్వచ్ఛంగా ఉంటాయి. క్యాంపింగ్, బోన్‌ఫైర్‌లు, ఫారెస్ట్ వాక్, సుర్కందా దేవి ఆలయం చూడడం వంటివి ఇక్కడ ఇక్కడ చేయవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం. వీకెండ్లో మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకోవడానికి లేదా మానసికంగా డీటాక్స్ అవ్వడానికి ఈ ప్రదేశాలకు వెళ్లిపోండి. ఢిల్లీకి దగ్గర్లో ఉండేవారు వీటిని వీకెండ్ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఢిల్లీకి దూరంగా ఉండేవారు.. 3-4 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశాలను వింటర్లో విజిట్ చేస్తే ఎక్స్పీరియన్స్ మరింత కొత్తగా, ప్రశాంతంగా ఉంటుంది.






















