Viral Video India 2021: 'ఏం చేస్తిరి ఏం చేస్తిరి.. దుమ్మురేపారు కదరా'.. ఈ ఏడాది ఇవే తోపు వీడియోలు!
2021లో ఇంటెర్నెట్‌ను షేక్ చేసి, సోషల్ మీడియాలో దుమ్మురేపిన వీడియోలను మరోసారి మీరూ చూసేయండి.
కరోనా దెబ్బకు 2021 కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌లు, మాస్కులు, శానిటైజర్లతో గడిచిపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొన్ని వీడియోలు నవ్వుల పువ్వులు పూయిస్తే.. మరి కొన్ని వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. వాటిని ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ నవ్వు వస్తూనే ఉంటుంది. అలాంటి టాప్ 10 వీడియోలపై ఓ లుక్కేద్దాం.
1. పారీ హో రహీ హే (Pawri ho rahi hai)
2021లో తెగ వైరల్ అయిన వీడియో 'పారీ హో రహీ హే'. పాకిస్థాన్ ఇన్‌ఫ్లుయెన్సర్ దన్నీర్ మొబీన్ చేసిన ఈ షార్ట్ వీడియో క్లిప్ చాలా పాపులర్ అయింది. దీనిపైన చాలా మీమ్స్ కూడా వచ్చాయి. అయితే మ్యూజిషిషన్ యశ్‌రాజ్ ముఖతే ఆమె చేసిన వీడియోరు మేషప్ చేసిన తర్వాత ఇది మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వీడియోకు 7 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ ఏడాదిలో పారీ హో రహీ హే ఓ ఊపు ఊపింది.
2. బచ్‌పన్ కా ప్యార్ (Bachpan ka pyaar)
View this post on Instagram
ఛత్తీస్‌గఢ్ చిన్నారి సహ్‌దేవ్ దిర్దో చేసిన ఈ వీడియో నెటిజన్లనే కాదు సెలబ్రెటీలను కూడా ఇష్టపడేలా చేసింది. బచ్‌పన్ కా ప్యార్ అనే ఈ లైన్స్ సోషల్ మీడియాలో వ్యూస్ తుపాను సృష్టించాయి. ఈ వీడియోను ఎంతో మంది సెలబ్రెటీలు కూడా రీక్రియెట్ చేశారు. ఈ వీడియోకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా ఫ్యాన్ అయిపోయారంటే అర్థం చేసుకోండి దీని పాపులారిటీ.
3. లైవ్‌లో ఉండగా భార్య తిట్లు
Please don't attend your wife's call when you are going live on social media 😂
— THE BONE DOCTOR OF J&K Dr Vikas Padha🇮🇳 (@DrVikasPadha) January 27, 2021
Dr KK Aggarwal , Senior Cardiologist and National President IMA 👇#MedTwitter pic.twitter.com/SP2naZqu8F
పద్మశ్రీ అవార్డు గ్రహీత, భారత వైద్య మండలి మాజీ అధ్యక్షుడు డా. కేకే అగర్వాల్ లైవ్‌లో ఉండగా ఆయన భార్య తనను తిట్టిన వీడియో కూడా ఈ ఏడాది వైరల్ అయింది. ఈ క్రేజీ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కొవిడ్ 19 ఫస్ట్ ఫేస్‌లో తన భార్యను తీసుకువెళ్లకుండా వ్యాక్సిన్ వేసుకున్నందుకు అగర్వాల్‌ను ఆమె తిట్టారు. ఆ సమయంలో ఆయన జూమ్ లైవ్ సెషన్‌లో ఉన్నారు. అయితే ఇటీవలే ఆయన కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు.
4. శ్వేత నీ మైక్ ఆన్‌లో ఉంది (Shweta your mic is on)
#Shweta అనేది ట్విట్టర్‌లో ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచింది. ఆన్‌లైన్ క్లాస్ సమయంలో శ్వేత అనే అమ్మాయి తన మైక్రోఫోన్ మ్యూట్ చేయడం మర్చిపోయి ఏదేదో మాట్లాడుతుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ అబ్బాయి గురించి శ్వేత చెప్పిన మాటలు ఇప్పటికీ వ్యూస్ వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. 'శ్వేత నీ మైక్ ఆన్‌లో ఉంది' అని తన స్నేహితులు చెబుతున్నా ఆ అమ్మాయి వినలేదు. ఆ ఆ ఆడియో మళ్లీ వినండి.
5. జూమ్ కాల్‌లో కిస్
Zoom call .....so funny 😄 😄😄pic.twitter.com/6SV62xukMN
— Harsh Goenka (@hvgoenka) February 19, 2021
భారత్‌కు చెందిన మరో జూమ్ వీడియో కాల్ కూడా తెగ వైరల్ అయింది. తన భర్త జూమ్ కాల్‌లో ఉన్నాడని తెలియని భార్య అతనికి కిస్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. వెంటనే అతను వెనక్కి జరిగి వీడియో కాల్‌లో ఉన్నానని సైగ చేస్తాడు. ఈ వీడియో ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర రీ ట్వీట్ చేశారు. 'వైఫ్ ఆఫ్ ది ఇయర్' పేరుతో ఈ వీడియో వైరల్ అయింది.
6. రస్పుతిన్ సాంగ్‌కు కేరళ విద్యార్థుల డ్యాన్స్
View this post on Instagram
కేరళ త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ కారిడార్‌లో తీసిన ఈ వీడియో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వీడియోలో ఇద్దరు మెడికల్ కాలేజీ విద్యార్థులు 1978లో వచ్చిన బనీ హిట్ సాంగ్ రస్పుతిన్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల లైక్‌లు సంపాదించింది. అయితే ఈ వీడియో కాలేజ్‌లో షూట్ చేయడం కాంట్రవర్సీ కూడా అయింది.
7. పీపీఈ కిట్‌లో అదిరిపోయే స్టెప్పులు
View this post on Instagram
గుజరాత్ వడోదరాలోని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలో షూట్ చేసిన ఓ వీడియో చూస్తే ఇప్పటికీ వావ్ అనిపిస్తుంది. కొవిడ్ బాధితులను ఉత్సాహపరిచేందుకు అక్కడి సిబ్బంది 'సోచ్‌నా క్యా, జో భీ హోగా దేఖా జాయేగా' అనే పాటకు పీపీఈ కిట్లు వేసుకొని స్టెప్పులు వేశారు. ఈ వీడియోను అక్కడి కొవిడ్ బాధితులతో పాటు నెటిజన్లు కూడా ఎంజాయ్ చేశారు.
8. రెమో డీ సౌజా..
View this post on Instagram
కరోనా సెకండ్ వేవ్ సమయంలో రెమిడెసివిర్ ఇంజెక్షన్‌కు ఎంత డిమాండ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సమయంలో రెమిడెసివిర్ పేరు మార్మోగిపోయింది. అయితే ఓ వ్యక్తి రెమిడెసివిర్ ఇంజెక్షన్ పేరు చెప్పబోయి కొరియోగ్రాఫర్ రెమో డీ సౌజా అని మీడియాకు చెబుతోన్న వీడియో ఈ ఏడాది వైరల్ అయింది. ఈ వీడియోను సదరు కొరియోగ్రాఫర్ కూడా షేర్ చేయడంతో ఇంకా వైరల్ అయింది.
9. మెడిసిన్ వద్దు మందే ముద్దు
#WATCH Delhi: A woman, who has come to purchase liquor, at a shop in Shivpuri Geeta Colony, says, "...Injection fayda nahi karega, ye alcohol fayda karegi...Mujhe dawaion se asar nahi hoga, peg se asar hoga..." pic.twitter.com/iat5N9vdFZ
— ANI (@ANI) April 19, 2021
2021 ఏప్రిల్‌లో దిల్లీలో లాక్‌డౌన్ విధించారు సీఎం కేజ్రీవాల్. ఆ సమయంలో లిక్కర్ దొరకదని వెంటనే బారు షాపులకు పరుగుపెట్టారు జనాలు. ఆ సమయంలో ఓ ముసలావిడ లిక్కర్ స్టోర్‌లో కనిపించేసరికి మీడియా ఆమె ముందు మైకు పెట్టింది. 'లాక్‌డౌన్ సమయంలో కూడా లిక్కర్ షాపులు తెరవాలని.. మందుల కంటే మందే ముద్దు' అని ఆమె చెప్పిన మాటలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. దీనిపైన మీమ్స్ కూడా వచ్చాయి.
10. లవ్ యూ జిందగీ
She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
— Dr.Monika Langeh (@drmonika_langeh) May 8, 2021
Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG
షారుక్ ఖాన్, ఆలియా భట్ నటించిన డియర్ జిందగీ సినిమాలోని లవ్ యూ జిందగీ సాంగ్‌ను కొవిడ్ 19 ఎమెర్జెన్సీ వార్డులో ఓ రోగి ఎంజాయ్ చేయడం తెగ వైరల్ అయింది. ఈ వీడియోను డా. మోనికా లంగేశ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆమె తెగింపునకు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే ఆమె తర్వాత చనిపోవడం బాధ కలిగించింది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 7,774 మందికి కరోనా.. 560 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Also Read: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి