అన్వేషించండి

Viral Video: డైరెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగ, పెంపుడు పిల్లి అరుపులతో అంతా అలెర్ట్ - వీడియో

Mumbai: ముంబయిలోని ఫిల్మ్ డైరెక్టర్ ఇంట్లోకి ఓ దొంగ చొరబడ్డాడు. సరిగ్గా చోరీ చేసే సమయానికి పెంపుడు పిల్ల అరిచి అందరినీ అలెర్ట్ చేసింది.

Viral News in Telugu: మరాఠీ ఫిల్మ్‌మేకర్ స్వప్న వాఘ్‌మేర్‌ జోషి ఇంట్లో చొరబడిన దొంగకి వాళ్ల పెంపుడు పిల్లి చుక్కలు చూపించింది. ఇంట్లో ఒక్క వస్తువు కూడా ముట్టుకోకుండా బయటకు తరిమింది. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో ఆరో అంతస్తులో ఉన్న దర్శకుడి ఇంట్లోకి దొంగ కిటికీలో నుంచి చొరబడ్డాడు. మెల్లగా ఏదో ఒకటి కాజేద్దామనుకున్నాడు. కానీ ఆ డైరెక్టర్ ఇంట్లోని పిల్లి మాత్రం ఒక్కసారిగా ఆ దొంగపై దాడి చేసింది. బయటకు పరిగెత్తేంత వరకూ తరిమింది. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి షాకైన డైరెక్టర్ స్వప్న వాఘ్‌మేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్టు అందులో రికార్డ్ అయింది. ముందుగా ఓ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు దొంగ. అక్కడే జోషి వాళ్ల తల్లి, ఆమె కేర్‌టేకర్ నిద్రిస్తున్నారు. అక్కడి నుంచి మెల్లగా మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడా పర్స్‌ని కొట్టేశాడు. అక్కడి నుంచి బయటపడాలని చూస్తుండగా పెంపుడు పిల్లి గట్టిగా అరిచింది. ఈ అరుపులతో అందరూ నిద్ర లేచారు. దొంగని చూసి పట్టుకోడానికి ప్రయత్నిచారు. కానీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashoke Pandit (@ashokepandit1)

మరో ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్‌ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. వృద్ధులు ఇంట్లో ఉన్న వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యాయని అన్నాడు. చాలా సులువుగా పై వరకూ వచ్చేశాడని చెప్పాడు. సెక్యూరిటీ గార్డ్‌లు ఫోన్‌లలో మునిగిపోతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై స్వప్న వాఘ్‌మేర్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి షేర్ చేసి అందరినీ అలెర్ట్ చేసినందుకు థాంక్స్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. వాచ్‌మెన్‌లు రాత్రి పూట పడుకుంటున్నారా అంటూ మరి కొందరు ఫైర్ అయ్యారు. 

Also Read: Social Media Policy: ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఇన్‌కమ్‌పై ప్రభుత్వం ఆంక్షలు, అలాంటి పోస్ట్‌లు పెడితే జీవిత ఖైదు తప్పదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Embed widget