అన్వేషించండి

Social Media Policy: ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఇన్‌కమ్‌పై ప్రభుత్వం ఆంక్షలు, అలాంటి పోస్ట్‌లు పెడితే జీవిత ఖైదు తప్పదు

UP Govt: సోషల్ మీడియాలోని కంటెంట్‌పై యూపీ సర్కార్‌ పూర్తి స్థాయిలో నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ పాలసీ కూడా తీసుకొచ్చింది.

New Social Media Policy: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా సోషల్ మీడియా పాలసీ తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లోని కంటెంట్‌పై ఈ పాలసీ ద్వారా నిఘా పెట్టనుంది. అభ్యంతరకర పోస్ట్‌లు, కామెంట్స్‌ పెడితే చట్టపరంగా వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కేబినెట్ ఈ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ కొత్త పాలసీ ప్రకారం ఎవరు అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టినా అది తీవ్రంగా నేరంగా పరిగణిస్తారు. ఆ కంటెంట్‌ని బట్టి మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకూ విధించే అవకాశముంది.

ఈ మేరకు ఐటీ చట్టంలో కీలక మార్పులు చేర్పులు చేశారు. అంతకు ముందున్న సెక్షన్స్‌కి కొత్తగా కొన్ని నిబంధనలు జోడించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని దుర్వినియోగపరిస్తే తీవ్ర పరిణామాలుండేలా ఈ మార్పులు చేశారు. అంతే కాదు. చట్టపరంగా ఎక్కడా ఏ విధంగాతప్పించుకునే వీల్లేకుండా చాలా పటిష్ఠంగా ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ మేరకు యోగి సర్కార్ V-Form అనే ఓ డిజిటల్ ఏజెన్సీకి సోషల్ మీడియా కంటెంట్‌ని పరిశీలించే బాధ్యతలు అప్పగించింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలు, ట్వీట్‌లు, పోస్ట్‌లు, రీల్స్‌పై ఈ సంస్థ నిఘా పెడుతుంది. 

ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఆదాయంపైనా కొరడా..!

సోషల్ మీడియా ద్వారా చాలా మంజి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చేతి నిండా సంపాదిస్తున్నారు. అయితే...వీళ్లు కూడా ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ పెట్టి సంపాదించుకోకుండా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. నెలవారీ ఆదాయానికి పరిమితులు పెట్టింది. X, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నెలకు రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలకు మించి చెల్లింపులకు వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నెలకి రూ.8 లక్షలకు మించి చెల్లింపులు చేయడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. వీడియోలకు గరిష్ఠంగా రూ.8 లక్షలు మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. (Also Read: Rameshwaram Cafe Blast: రైళ్లలో బాంబులు పెట్టి పేల్చేస్తాం, రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి వార్నింగ్‌ - వీడియో విడుదల)

కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కంటెంట్‌ కోసం విపరీత చేష్టలు చేస్తున్నారు. ప్రమాదకర స్టంట్‌లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్‌ పెరుగుతోంది. లైక్స్‌, షేర్‌ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవలే ఓ యువతి సెల్ఫీ దిగితూ 70 అడుగుల లోయలో పడిపోయింది. స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడింది. అంతకు ముందు మరో యువతి ఇలానే ప్రమాదానికి గురై మృతి చెందింది. ఇక ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని చెప్పుకుని కాస్త అశ్లీల కంటెంట్‌ కూడా అప్‌లోడ్ చేస్తున్నారు కొంత మంది. వీటిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాపైనా నిఘా ఉండాల్సిన అవసరముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read: Vehicle Discount: కొత్త కార్‌ కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్, ఇలా చేస్తే భారీ డిస్కౌంట్ మీ సొంతం


  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget