Gukesh: సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Chess : చెస్ వరల్డ్ చాంపియన్ గుకేష్‌పై తీవ్రమైన వివక్షచూపిస్తున్నారు. చిన్నవయసులో సాధించిన విజయాన్ని చాలా మంది తట్టుకోలేకపోతున్నారు.
Serious discrimination against the chess world champion Gukesh: ప్రపంచ చదరంగ చరిత్రలో భారత్‌కు చందిన దొమ్మరాజు గుకేష్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ చాంపియన్ గా పద్దెనిమిదేళ్ల వయసులోనే నిలిచారు. మన దేశంలో అందరూ అభినందిస్తున్నారు కానీ.. విదేశాల్లో మాత్రం గుకేష్ విజయాన్ని భరించలేకపోతున్నారు. అత్యంత ఘోరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరిలో మీడీయాతో పాటు ఆటగాళ్లు కూడా ఉన్నారు.వీరి విమర్శలు ఏ మాత్రం సేహతుకంగా లేకపోగా.. కుళ్లుతో, ఈర్ష్యతో చేసినట్లుగా ఉంటున్నాయి.
సాంబార్ అంటూ వార్తలు రాస్తున్న మీడియా
వరల్డ్ చెస్ చాంపియన్ గా సాంబార్ వ్యక్తి గెలిచాడంటూ.. .సింగపూర్ పత్రిక రాసిన కథనం తీవ్ర సంచలనం అయింది. అది ఖచ్చితంగా వివక్ష చూపించడమేనన్న అభిప్రాయం వ్యక్తమయింది. ఈ మీడియా కథనం, రాసిన హెడ్ లైన్ ను అందరూ విమర్శిస్తున్నారు.అయితే కొంత మంది మాత్రం.. చెస్ చాంపియన్ షిప్ జరిగిన తీరు, వచ్చిన ఫలితాలన్ని ప్రశ్నిస్తూ.. అదో సర్కస్ లా మారిందని అంటున్నారు. ఇందులో దిగ్గజ చెస్ ఆటగాళ్లు కూడా ఉండటమే అసలు విషాదంగా మారింది.
Also Read: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
గుకేష్ తో గెలవలేక కార్ల్ సన్ అనుచిత వ్యాఖ్యలు
చెస్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న మాగ్నస్ కార్ల్ ససన్..గుకేష్ విజయాన్ని తక్కువ చేసి చూస్తున్నారు.ఆ ఆట ఓ సర్కస్ లా ఉందని.. అలాంటి సర్కస్ ను ఇక తాను ఆడబోనని అంటున్నారు. గుకేష్ ను ఓడించి ఆ మాట చెబితే కాస్త విలువ ఉండేది. ఇప్పుడు గుకేష్‌తో గెలవలేక ఆయన పారిపోతున్నారన్న అభిప్రాయానికి వస్తున్నారు. నిజానికి ప్రపంచ చాంపియన్ షిప్ లో జరిగిన పోరాటాలు ఆ స్థాయిలో లేవని గుకేష్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సారి హోరాహోరీ సాగాలని ఏమీ లేదు. కొన్ని సార్లు ఇలాంటి ఆటలు ఉంటాయని దాన్ని స్పోర్టివ్ గా తీసుకోకపోతే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
గుకేష్ గొప్పతనాన్ని అంగీకరించలేని మనస్థత్వం
గుకేష్ ప్రపంచ చాంపియన్. గెలుపు గెలుపే. కార్లసన్ అయినా..మరొకరు అయినా విజయాన్ని తక్కువ చేయలేరు. కార్లసన్ ఐదు సార్లు ప్రపంచ చాంపియన్. ఎవరూ ఆయన విజయాలను ప్రశ్నించలేదు. ఆయన కంటే తెలివైనా చెస్ ఆటగాళ్లు వచ్చినప్పుడు కచ్చితంగా అభినందిస్తే స్పోర్టివ్ స్పిరిట్. కానీ పద్దెనిమిదేళ్లకే అందర్నీ దాటేసిన గుకేష్ అంటే.. చాలా మందికి ఈర్ష్యలా కనిపిస్తోంది. అందుకే ఈ ఏడుపులు అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. వీటన్నింటికీ గుకేష్ రాబోయే రోజుల్లో తన ఆటతీరుతోనే సమాధానం చెబుతారని అనుకుంటున్నారు.