Collector Security Suicide: భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య - సిద్ధిపేట జిల్లాలో దారుణం
Siddipet News: సిద్ధిపేట కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వెంట తెచ్చుకున్న తుపాకీతో భార్య, పిల్లలను చంపి బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది.
![Collector Security Suicide: భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య - సిద్ధిపేట జిల్లాలో దారుణం telangana news siddipet collector gunman commits suicide after killing his wife and two children Collector Security Suicide: భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య - సిద్ధిపేట జిల్లాలో దారుణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/15/4e3cab744d4db118bd3975e537223bff1702627342007876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Siddipet Collector Security Suicide: సిద్ధిపేట (Siddipet) జిల్లా చిన్నకోడూరు (Chinnakoduru) మండలం రామునిపట్లలో (Ramunipatla) శుక్రవారం దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపిన కలెక్టర్ గన్ మెన్ అనంతరం గన్ తో తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ (Jeevanpatil) వద్ద గన్ మెన్ గా పని చేస్తున్న ఆకుల నరేష్ (Akula Naresh), తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీతో కలిసి చిన్నకోడూర్ లోని రామునిపట్లలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం నరేశ్ విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. తన వెంట తెచ్చుకున్న 9 ఎంఎం పిస్టల్ తో భార్య, పిల్లలను కాల్చేశాడు. అనంతరం తానూ కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విధులకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న నలుగురిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా.? లేక కుటుంబ కలహాలు కారణమా.? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.? అని ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)