X
Super 12 - Match 13 - 23 Oct 2021, Sat up next
AUS
vs
SA
15:30 IST - Sheikh Zayed Stadium, Abu Dhabi
Super 12 - Match 14 - 23 Oct 2021, Sat up next
ENG
vs
WI
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Smart Phone eVoting: స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ-ఓటింగ్‌.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ నుంచే అమలు..

కోవిడ్ కారణంగా ప్రపంచమంతా డిజిటల్ యుగం వైపు పరుగులు పెడుతోంది. సాంకేతికత సాయంతో ఇంటి నుంచే అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా ఓట్లు కూడా ఇంటి నుంచే వేసేలా ఈ-ఓటింగ్‌ విధానాన్ని రూపొందించారు.

FOLLOW US: 

ఓటింగ్ విధానంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అధునాతన టెక్నాలజీ సాయంతో ఇంటి నుంచే ఓటు వేసేలా ఈ-ఓటింగ్‌ విధానం రూపుదిద్దుకుంది. తెలంగాణ నుంచే ఇది ఆరంభం కానుండటం విశేషం. మొబైల్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఓటు వేసేలా దీనిని అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), రాష్ట్ర ఐటీ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీడాక్ (CDAC), ఐఐటీ బిలాయ్ డైరెక్టర్, ఈసీఐ సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ రజత్ మూనా, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ల సంయుక్త కార్యాచరణలో ఈ యాప్ తయారైంది. 

Also Read: పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...

ఖమ్మంలో ప్రయోగాత్మకంగా పరిశీలన.. 
ఈ-ఓటింగ్ యాప్ పనితీరును పలుమార్లు పరిశీలించారు. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో డమ్మీ ఓటింగ్ పేరుతో వీటిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. అక్టోబర్ 8 నుంచి 18వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్ 20న డమ్మీ ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇది పరిశీలన కావడంతో పౌరులందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. 

Also Read: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సాయంతో.. 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలను ఇందులో వినియోగించారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో వివరాలు మార్చడం కుదరదు. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫొటోలను సరిపోల్చేందుకు సాయం చేస్తుంది. ఈ రెండు టెక్నాలజీలలో అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఫోన్ హ్యాక్ చేయడానికి వీలులేని సాంకేతికతను ఇందులో వినియోగించారు. ఈ-ఓటింగ్ విధానంలో ఓటు వేయడం కోసం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయడం కుదరదు. లైవ్‌ ఫొటోతో నిర్ధారించిన తర్వాతనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఒకే ఫోన్ ద్వారా ఇద్దరు కుటుంబ సభ్యులు మాత్రమే ఓటు వేసే సదుపాయం కల్పించారు. రిజిస్ట్రేషన్, ఓటింగ్‌ ప్రక్రియలకు ఒకే ఫోన్‌ నంబర్, మొబైల్‌ ఫోన్‌ను వినియోగించాలి. ఒకరి బదులుగా వేరే వ్యక్తి ఓటు వేయడానికి వీలుండదు. 

Also Read: మెడిసన్ ఫ్రమ్ స్కైలో సరికొత్త టెక్నాలజీ.. పేలోడ్ సాయంతో మందులు.. ప్రయోగాత్మకంగా అమలు

ఎలా పనిచేస్తుందంటే? 
ఓటు వేయాలనుకునే వ్యక్తి ముందుగా మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఓటరు ఐడీ నంబరు, ఆధార్ వివరాలు అందించాల్సి ఉంటుంది. అదే ఫోన్ ద్వారా లైవ్ ఫొటో తీసుకుని అప్ లోడ్ చేయాలి. ఓటర్ ఐడీలో ఉన్న ఫొటోతో సరిపోల్చి నిర్ధారించుకుంటుంది. అనంతరం ఫొటోలను ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో పోలుస్తుంది. ఓటీపీ ధ్రువీకరణతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

Also Read: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి. 

Tags: telangana TS News Smart Phone eVoting Smart Phone Voting eVoting Voting Voting App eVoting App

సంబంధిత కథనాలు

KTR Plan :  బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

KTR Plan : బీజేపీ -కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి ఈటల అంటూ కేటీఆర్ ప్రచారం ! టీఆర్ఎస్‌కి ప్లస్సా ? మైనస్సా ?

 వారి కంటే.. ఓబీసీ కోటాలో ఎక్కువ మార్కులు వస్తే అపాయింట్ మెంట్ పొందే హక్కు ఉంటుంది: హైకోర్టు 

 వారి కంటే.. ఓబీసీ కోటాలో ఎక్కువ మార్కులు వస్తే అపాయింట్ మెంట్ పొందే హక్కు ఉంటుంది: హైకోర్టు 

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం

WhatsApp: వాట్సాప్ విదేశి సంస్థ.. భారత చట్టాలను సవాలు చేయలేదు.. అడిగితే సమాచారం ఇవ్వాల్సిందే.. కేంద్రం

ఉత్తరాఖండ్ లో 11 మంది ట్రెక్కర్లు మృతి.. మిగతా వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ఉత్తరాఖండ్ లో 11 మంది ట్రెక్కర్లు మృతి.. మిగతా వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...

TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

T20 World Cup 2021: పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీసేనకు ఉందా? ధోనీ మెంటారింగ్‌తో లాభం ఏంటి?

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Tirupati: తిరుపతిలో విషాదం.. వర్షపు నీటిలో మునిగిన వాహనం.. నవ వధువు దుర్మరణం

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..

Happy Birthday Prabhas: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..