X

KTR Helping Hands : పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...

విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని ఫీజులకు డబ్బుల్లేక కూరగాయలు అమ్ముకుంటోంది. విషయం తెలిసిన కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు.

FOLLOW US: 

ఆపదలో ఉన్న వారిని.. అవసరంలో ఉన్న వారిని ఆుదకోవడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన కుదిరితే ప్రభుత్వ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా సాయం చేసేందుకు ఏ మాత్రం ఆలోచించరు. ఇలాంటి సాయాలు చేసేందుకు ఆయన తరపున ఓ ప్రత్యేకమైన టీం కూడా పని చేస్తుంది. ఇటీవలే ఉన్నత చదువులు చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న యువతి దుస్థితి గురించి తెలుసుకుని వెంటనే ఉద్యోగం ఇప్పించిన కేటీఆర్ .. ఇవాళ మరో చదువుల తల్లికి సాయం చేశారు. మెడిసిన్‌లో సీటు సాధించిన పేద పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబిబిఎస్ చదువుకి సహకారం అందించారు.

Also Read : మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!

హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో మెడిసన్ చదవుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. నాలుగో ఏడాది చదువు కొనసాగించాలంటే ఫీజులు కట్టాలి. కానీ కరోనా కారణంగా ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు.  మళ్లీ కిర్గిజీస్తాన్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో  తల్లి తో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. 

Also Read : రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?

అనూష చదువు గురించి మంత్రి కేటీఆర్‌కు తెలిసింది.  వైద్య విద్య కోర్సు  ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కొంత మంది  మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్య పై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. తన ప్రతినిధుల్ని పంపించి వివరాలు తెలుసుకున్నారు. వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు.

Also Read : టాలీవుడ్ పెద్ద దిక్కెవరో తేల్చనున్న "మా" ఎన్నికలు ! అసలు పోటీ మోహన్‌బాబు, చిరంజీవి మధ్యేనా ?

అనూష మెడిసిన్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్ ఆర్థిక సాయం చెక్‌ను అందించారు.  కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలని విషెష్ చెప్పారు. అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బిడ్డ చదువుపై ఆశలు వదిలేసుకున్న తమకు కేటీఆర్ అండగా నిలిచినందుకు ఆ కుటుంబం సంతోషపడింది. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Also Read : ఎరక్కపోయి ఇరుక్కున్న ఎయిరిండియా.. ఫ్లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుందో చూడండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: KTR MBBS STUDENT KTR HELP TEAM KTR kTR HELPS ANUSHA

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Breaking News Live Updates: హుజూరాబాద్ ఉప ఎన్నికలు.. మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Huzurabad by poll: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Huzurabad by poll: ఈటల గెలిచినా మంత్రి అయ్యేది లేదు... ధరలు పెంచిన బీజేపీని ఎందుకు గెలిపించాలి.... మంత్రి హరీశ్ రావు కామెంట్స్

Telangana Govt: వ్యాక్సినేషన్ అవ్వకపోతే రేషన్, పింఛన్ కట్ వార్తలన్నీ ఫేక్.. స్పష్టత ఇచ్చిన డీహెచ్

Telangana Govt: వ్యాక్సినేషన్ అవ్వకపోతే రేషన్, పింఛన్ కట్ వార్తలన్నీ ఫేక్.. స్పష్టత ఇచ్చిన డీహెచ్

Warangal: విస్తరిస్తున్న ఆంత్రాక్స్ వ్యాధి.. వరుసగా గొర్రెలు మృతి, ఆందోళనలో ప్రజలు

Warangal: విస్తరిస్తున్న ఆంత్రాక్స్ వ్యాధి.. వరుసగా గొర్రెలు మృతి, ఆందోళనలో ప్రజలు

TRS Harish Kavita : ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?

TRS Harish Kavita :  ప్లీనరీలో కనిపించని హరీష్‌రావు, కవిత ! టీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందా ?
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!

Seven Week Jewellery: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!