అన్వేషించండి

Iran US Israel Attack: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి! వీడియో వైరల్‌!

Iran US Israel Attack: అమెరికా రాయబార కార్యాలయాల హై అలర్ట్‌లో ఉన్నాయి, పశ్చిమాసియాను విడిచి వెళ్లాలనుకునే అమెరికన్లకు అమెరికా విదేశాంగ శాఖ సహాయం చేస్తోంది.

Iran US Israel Attack: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి తర్వాత పరిమిత స్థాయిలో మంటలు చెలరేగాయని అధికారులు ధృవీకరించారు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.

కాన్సులేట్ సమీపంలో జరిగిన డ్రోన్ దాడి తర్వాత చెలరేగిన మంటలను త్వరగా అదుపులోకి తెచ్చినట్లు దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి, నిమిషాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని పేర్కొంది. 

మంటలు త్వరగా అదుపులోకి వచ్చాయి, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. 
సుమారు 45 నిమిషాల తర్వాత, మంటలు పూర్తిగా ఆరిపోయాయని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.  

ది వాల్ స్ట్రీట్ జర్నల్ మరిన్ని వివరాలు వెల్లడించింది. కాన్సులేట్ పార్కింగ్ ఏరియాను డ్రోన్ హిట్ చేసినట్టు రిపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో అవుతున్న వీడియో క్లిప్‌లు చూస్తే ఆకాశంలో నల్లటి పొగలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. 

అప్రమత్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు

దుబాయ్‌లో జరిగిన ఈ ఘటన ఒక రోజు ముందు సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, సోమవారం రెండు డ్రోన్లు ఆ ప్రాంగణాన్ని ఢీకొట్టాయి, దీనివల్ల మంటలు చెలరేగాయి. ఇలా అమెరికా రాయబార కార్యాలయంపై దాడులు జరుగుతున్న వేళ యూఎస్ అప్రమత్తమైంది. జెడ్డా, రియాద్, ధహ్రాన్‌లోని అమెరికన్‌లు సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించింది. కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. 

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యం నుంచి బయలుదేరాలనుకునే అమెరికన్లకు సహాయం చేయడానికి విదేశాంగ శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. చార్టర్ విమానాల ఏర్పాటు, సైనిక రవాణా ఆప్షన్లు, ఇతర విమానాల సంఖ్యను పెంచడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తున్నట్టు వెల్లడించారు.  

"మేము చార్టర్ విమానాలు, సైనిక విమాన,వాణిజ్య విమాన  ఆప్షన్‌లు గుర్తించాము. ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది." అని రూబియో విలేకరులతో అన్నారు, ఎక్కువ మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి పెద్ద విమానాలను మోహరించే ప్రయత్నాలు చేస్తున్నామని కూడా తెలిపారు. గగనతల మూసివేయడం వల్ల అక్కడకు వెళ్లే విమానాలు వెనక్కి వచ్చాయని ఆయన వెల్లడించారు. 

మరోవైపు ఇరాన్ యుద్ధంలో మరణించిన నలుగురు అమెరికన్ సైనికుల ఫొటోలను పెంటగాన్ విడుదల చేసింది. కువైట్‌లోని పోర్ట్ షుయిబాలోని కమాండ్ సెంటర్‌పై ఇరాన్ డ్రోన్ దాడిలో ఈ సైనికులు చనిపోయారు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు సైనికులు మరణించారు, కానీ ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. 

ఈ నలుగురు సైనికులు అయోవాకు చెందినవారని, వారిని ఆర్మీ రిజర్వ్ 103వ సస్టైన్‌మెంట్ కమాండ్ యూనిట్‌కు నియమించినట్లు పెంటగాన్ తెలిపింది, ఇది దళాలకు ఆహారం, నీరు, ఇంధనం, మందుగుండు సామగ్రి, రవాణా వంటి అవసరమైన సామాగ్రిని అందిస్తుంది. ఈ దాడి ఆదివారం జరిగింది. 

కెప్టెన్ కోడి ఖోర్క్, 35, ఐయోవా
సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నోహ్ టైట్జెన్స్, 42, ఐయోవా
సార్జెంట్ ఫస్ట్ క్లాస్ నికోల్ అమోర్, 39, ఐయోవా
సార్జెంట్ డెక్లాన్ కోడి, వయసు 20, ఐయోవా

యుద్ధంలో మరిన్ని మరణాలు : ట్రంప్

ఈ ఘటన గురించి ఆర్మీ కార్యదర్శి డేనియల్ డ్రిస్కాల్ మాట్లాడుతూ, "ఈ ధైర్యవంతులైన వ్యక్తులు తమ దేశాన్ని రక్షించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారి త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేము" అని అన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ఈ యుద్ధం ముగిసేలోపు మరిన్ని మరణాలు చూస్తామని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget