News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

YS Jagan: స్పెషలైజేషన్‌ ఆస్పత్రులపై దృష్టి పెట్టండి.. స్థానికంగానే వైద్య సేవలు అందించాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..

రాష్ట్రానికి అవసరమైన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష జరిపారు.

FOLLOW US: 
Share:

వైద్యం కోసం ప్రజలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని.. మన రాష్ట్రంలోనే చికిత్స అందించే విధంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు ఏయే రకాల చికిత్సల కోసం వెళ్తున్నారో గుర్తించి ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ రకమైన వైద్య సేవలు స్థానికంగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌ తదితర అంశాలపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రానికి అవసరమైన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష జరిపారు. కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నెలాఖరుకు వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

Also Read: ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. తాజాగా 9 మంది మృతి

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్పెప్ట్‌పై సమీక్ష.. 
రాష్ట్రంలో కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. జనవరి 26 నాటికి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు. స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా మహిళలు, బాలికల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ సూచించారు. 

Also Read: జగన్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ ..ఎందాకైనా వెళ్తానన్న రఘురామ..!

ఆరోగ్య శ్రీపై హోర్డింగ్స్‌ పెట్టాలి..
ఆరోగ్య శ్రీ కార్యక్రమంపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలని జగన్ అదికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ మీద ప్రచారం ఉండాలని తెలిపారు. ఆరోగ్య మిత్రల ఫోన్‌ నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌లో ఉంచాలని పేర్కొన్నారు. ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్న చెప్పారు. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎమ్‌పానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 108 వెహికల్స్‌ సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పారు. 

Also Read: తెలుగులోనూ ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ముఖ్యమైన తేదీలివే..

ఏపీ డిజిటల్‌ హెల్త్‌పై సీఎం సమీక్ష
హెల్త్‌ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్‌ (QR) కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలని సీఎం తెలిపారు. ఆరోగ్య పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలని సూచించారు. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌కార్డుల్లో పొందుపర్చాలని తెలిపారు. 

పౌరులందరికీ హెల్త్‌ ఐడీలు.. 
డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై వివరాలను అందించారు. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 98.86 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం 313 మంది కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 11,997 సచివాలయాల్లో జీరో కేసులు నమోదైనట్లు చెప్పారు. థర్డ్ వేవ్‌కు సన్నద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 20,964 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేశామని.. ఇంకా 2,493 రావాల్సి ఉందని వివరించారు. 27,311 డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 140 ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. అక్టోబరు నెలాఖరు నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని వివరించారు. 

Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ

2.83 కోట్ల మందికి టీకాలు..
ఇప్పటివరకు 2,83,27,473 మంది కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 1,38,32,742 మంది సింగిల్‌ డోసు.. 1,44,94,731 మంది రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నట్లు వివరించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. 

Also Read: ఏపీ ఆర్జీయూకేటీ సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే.. టాప్ ర్యాంకర్లు వీరే..

Also Read: తప్పయింది.. ఇక ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయం ! హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Oct 2021 06:43 PM (IST) Tags: YS Jagan AP News AP Covid YS Jagan review on Covid

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: మంత్రులకు శాఖలు కేటాయించిన రేవంత్ రెడ్డి

Breaking News Live Telugu Updates: మంత్రులకు శాఖలు కేటాయించిన రేవంత్ రెడ్డి

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

APPSC Group-1:  ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

AP Tenth: 'టెన్త్‌' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!

Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

Breaking News Live Telugu Updates: కేసీఆర్‌ కోలుకోవడానికి నెలకుపైగా సమయం- హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం