Raghu Rama : జగన్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ ..ఎందాకైనా వెళ్తానన్న రఘురామ..!
సీఎం జగన్ బెయిల్ రద్దు కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని ఎంపీ చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై ఉన్న సీబీఐ కేసుల విచారణను ఉద్దేశపూర్వకంగా సీఎం జగన్ ఆలస్యం చేస్తున్నారని.. కావాలనే కోర్టుకు హాజరు కావడం లేదని.. అందుకే జగన్‌పై ఉన్న 11 ఛార్జీషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని కోరానన్నారు. ఢిల్లీలో వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడిన ఆయన హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ గురించిచెప్పారు.
Also Read : టీటీడీ బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు ! నియామకం చెల్లని హైకోర్టులో పిటిషన్..
ఈడీ కోర్టుకు జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావలసి ఉందని, కానీ ఏదో ఒక కారణంతో వారు రావడం లేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇంకా ఎన్ని వాయిదాలు వేస్తారో చూడాలని రఘురామ వ్యాఖ్యానించారు. ఇప్పటికే సీబీఐ కోర్టులో ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిగిన తర్వాత నాంపల్లి సీబీఐ కోర్టు ఆ పిటిషన్లను కొట్టి వేసింది. దీనిపై తాను పై కోర్టును ఆశ్రయిస్తానని గతంలోనే ఎంపీ ప్రకటించారు. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. పిటిషన్‌కు విచారణ అర్హత ఉందోలేదో హైకోర్టు తేల్చనుంది. న్యాయం కోసం, ధర్మం కోసం చివరి వరకు పోరాడుతానని రఘురామ ప్రకటించారు.
Also Read : తప్పయింది.. ఇక ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయం ! హైకోర్టులో ఏపీ ప్రభుత్వ ప్రమాణపత్రం !
ఉపాధి హామీ నిధుల చెల్లింపు విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రఘురామ కృష్ణరాజు సమర్థించారు. ఒకరి పొట్ట కొట్టి.. మరొకరికి డబ్బులిస్తామనడం సరికాదని... అందరికీ ఉపాధి బిల్లులు చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. ప్రభుత్వం నమ్మకం కోల్పోయిందన్నారు. ఎక్కడైా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు క్యూ కడతారన్నారు. అదీ కాకుండా దేశంలో ఎక్కడ టెండర్లు పిలిచినా తెలుగు కాంట్రాక్టర్లు ముందు ఉంటారని అలాంటిది ఏపీలో పనులకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు.
Also Read : "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
విద్యార్థుల పుస్తకాల్లో అమరావతిని పాఠ్యాంశం నుంచి తీసేయడంపై మండిపడ్డారు అమరావతి పాఠ్యాంశం ఎందుకు తీసేయాల్సి వచ్చిందని రఘురామ ప్రశ్నించారు. రంజాన్ పండుగకు తోఫాలు, క్రిస్టమస్‌కు కానుకలు ఇస్తారని.. మరీ హిందువుల పండుగలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Also Read : నిధులపై కేంద్రం - రాష్ట్రం టగ్ ఆఫ్ వార్ ! పోలవరం కల సాకారం ఎప్పటికి ?