By: ABP Live Focus | Updated at : 06 Oct 2021 08:05 PM (IST)
Edited By: sharmiladevir
మెడిసన్ ఫ్రమ్ స్కై (Image Courtesy: Twitter/T Works)
డ్రోన్ల ద్వారా మందులు అందించే ప్రక్రియలో (మెడిసన్ ఫ్రమ్ స్కై) మరో సరికొత్త టెక్నాలజీ చేరింది. ఆటోమెటిగ్గా మందులు అందించే తీరుగా టీ- వర్క్స్ (T-Works) సంస్థ పేలోడ్‌ను రూపొందించింది. హైదరాబాద్ నగరానికి చెందిన డ్రోన్ కంపెనీ ఎయిర్‌సర్వ్ సహకారంతో దీనిని అభివృద్ధి చేసింది. తాజాగా రూపొందించిన సాంకేతికత ద్వారా డ్రోన్లు వాటంతట అవే ఆటోమెటిగ్గా మందులను అందించగలుగుతాయి. ఇప్పటివరకు డ్రోన్ల ద్వారా సరఫరా అయిన మందులను ఆస్పత్రి సిబ్బంది తీసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం టీ వర్క్స్ తీసుకొచ్చిన టెక్నాలజీ ద్వారా కోల్డ్ స్టోరేజ్ మెడికల్ సప్లయిస్ పేలోడ్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే మందులను వదిలి వచ్చేస్తుంది. ఒక్కసారి పేలోడ్‌ను విడిచి పెట్టాక.. డ్రోన్లు వాటంతట అవే వాటి ప్రారంభ స్థావరానికి చేరుకుంటాయి. డ్రోన్ నుంచి పేలోడ్ విడుదల కావడానికి కేవలం ఒక సెకను మాత్రమే సమయం పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటానికి ఈ విధానం తోడ్పడనుంది.
ప్రయోగం విజయవంతం కావడంతో..
డ్రోన్ల నుంచి పేలోడ్ విడుదల ప్రక్రియను ఎయిర్‌సర్వ్ సంస్థ ఈరోజు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. వికారాబాద్ ఏరియా ఆస్పత్రి నుంచి మాడుగుల చింతపల్లి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు మందులు పంపింది. ఈ రెండు కేంద్రాల మధ్య 6.2 కి.మీ దూరం ఉంది. మెడిసన్స్ ఫ్రమ్ స్కై ట్రయల్స్ కార్యక్రమంలో భాగంగా మందులను పంపించింది. ఈ కార్యక్రమం విజయవంతమైందని ఎయిర్‌సర్వ్ సంస్థ వెల్లడించింది.
డ్రోన్ల నుంచి మందులు తీసుకునేటప్పుడు ప్రమాదం జరగకుండా..
ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్య సిబ్బంది డ్రోన్ల ద్వారా వచ్చే మందులను తీసుకునేవారు. ఈ ప్రక్రియలో డ్రోన్ల వల్ల వైద్య సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మాన్యువల్ విధానంగా కాకుండా ఆటోమెటిగ్గా మెడిసన్స్ అందించాలనే ఉద్దేశంతో పేలోడ్ డిజైన్ చేశామని టీ వర్క్స్ సీఈవో సుజయ్ కారంపురి వెల్లడించారు. అన్ని రకాల ఔషధాలను సాధారణ ఉష్ణగ్రత వద్ద పంపలేమని గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఎయిర్ సర్వ్ సహకారంతో కోల్డ్ స్టోరేజ్ పేలోడ్ (cold storage medical supplies payload) రూపొందించినట్లు పేర్కొన్నారు.
Congratulations @AirserveIndia on successful medical drone delivery trials held today! Thrilled to see our design for the cold storage payload and release mechanism making this a success.
— T Works (@TWorksHyd) October 6, 2021
Read more: https://t.co/G30U07mjZw@KTRTRS @MinisterKTR @jayesh_ranjan @KarampuriSujai pic.twitter.com/m2Aph8N7I5
Also Read: పేదరికంతో వైద్య విద్య ఆపేసి కూరగాయల అమ్మకం ! కేటీఆర్‌కు తెలిసిన వెంటనే...
Also Read: దసరాకి ఊరెళ్తున్నారా..? ఇలా చేస్తే మీ కాలనీకే బస్సు వస్తది.. ఆర్టీసీ ఛైర్మన్ ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసంABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Top Headlines Today: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు- 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం!
Vandebharat Trains: 11 రాష్ట్రాల్లో 9 వందేభారత్‌లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల నుంచి రెండు రైళ్లు
NEET-MDS: నీట్ ఎండీఎస్ కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Motkupalli Narasimhulu: జగన్ ప్రభుత్వంతో ఏపీలో దుర్మార్గాలు, జనం నవ్వుకుంటున్నారు - దీక్షలో మోత్కుపల్లి కీలక వ్యాఖ్యలు
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల ర్యాలీకి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి మద్దతు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!
/body>