అన్వేషించండి

Tamil Nadu political updates: రాజకీయ చదరంగం ప్రారంభించేసిన విజయ్ - రాజీనామాలు చేసి టీవీకేలో చేరిన ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

TVK joinings: తమిళనాడులో అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. అయితే 25 మందిలో ముగ్గురే రాజీనామా చేశారు. ఉపఎన్నికల భయంతో మిగిలిన వారంతా ఈపీఎస్ వద్దకు చేరుతున్నారు.

Tamilnadu AIADMK MLAs resign And Join TVK:   తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే దళపతి విజయ్ తన రాజకీయ చతురత ను ప్రదర్శించారు. అన్నాడీఎంకే  ని కోలుకోలేని దెబ్బ తీస్తూ, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తన గూటికి చేర్చుకున్నారు.  

తమిళనాడు రాజకీయ క్షేత్రంలో ముఖ్యమంత్రి విజయ్ తన మార్క్ రాజకీయాన్ని మొదలుపెట్టారు. అన్నాడీఎంకేలో అసమ్మతి సెగలు రాజేసి, ఆ పార్టీని బలహీనపరిచే వ్యూహానికి తెరలేపారు. సోమవారం సచివాలయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తమ పదవులకు రాజీనామా చేశారు. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో స్పీకర్ వారి రాజీనామాలను తక్షణమే ఆమోదించారు. పదవులకు రాజీనామా చేసిన కొద్ది నిమిషాల్లోనే వారు మంత్రి ఆధవ్ అర్జున సమక్షంలో అధికార  తమిళగ వెట్రి కజగం  పార్టీలో చేరిపోయారు.  
 
ఇటీవల అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో సీవీ షణ్ముగం - ఎస్పీ వేలుమణి నేతృత్వంలో ఏకంగా 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే, పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు పడకుండా ఉండాలంటే సభలో 2/3 వంతు బలం ఉండాలి. అన్నాడీఎంకేకు ఉన్న ఎమ్మెల్యేల్లో 32 మంది ఉంటేనే చీలిక చెల్లుతుంది. ఆ బలం లేకపోవడంతో, విజయ్ ప్రభుత్వం ఒక పక్కా లీగల్ స్ట్రాటజీని అమలు చేసింది.  పార్టీ ఫిరాయించి అనర్హత వేటు వేయించుకోవడం కంటే, స్వచ్ఛందంగా రాజీనామా చేసి వస్తే ఉపఎన్నికల్లో టికెట్ ఇస్తాం  అని టీవీకే ఇచ్చిన హామీతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తెగించి ముందుకు వచ్చారు.
 
రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకు కంచుకోట లాంటి  పశ్చిమ తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. తమ సొంత చరిష్మాతో ఇక్కడ మళ్ళీ గెలవగలమనే ధీమాతోనే వీరు రాజీనామా చేశారు. టీవీకే చీఫ్ కోఆర్డినేటర్,  సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టయన్ వీరికి పూర్తి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు స్థానాల్లో టీవీకే గెలిస్తే, ఆ ప్రాంతంలో అన్నాడీఎంకే ప్రాబల్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టవచ్చని విజయ్ భావిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌తో అన్నాడీఎంకేలో చీలిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న షణ్ముగం బృందానికి కూడా గట్టి సంకేతాలు పంపినట్లయింది. 

 
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా నిర్ణయంతో తిరుగుబాటు క్యాంప్‌లో కలకలం రేగింది. ఉపఎన్నికలకు వెళ్లడం అంటే రిస్క్ అని భావించిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వెంటనే యూ-టర్న్ తీసుకున్నారు. వారు షణ్ముగం వర్గం నుంచి బయటకు వచ్చి, మళ్ళీ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి కి మద్దతు ప్రకటించారు. దీంతో తిరుగుబాటు వర్గం బలం 25 నుంచి 17కి పడిపోగా, ఈపీఎస్ తన బలాన్ని 27కి పెంచుకుని పార్టీపై పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ముగ్గురి బాటలో మరికొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి.
 
ప్రస్తుత పరిణామాలతో తమిళనాడులో త్వరలోనే నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగడం ఖాయమైంది. ముఖ్యమంత్రి విజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు, ఇప్పుడు రాజీనామా చేసిన ఈ మూడు స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఈ ఉపఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న విజయ్, అక్కడ గెలిచి తన పవర్ ఏంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. అన్నాడీఎంకే మాత్రం తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget