అన్వేషించండి

Stalin Vs Vijay: విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు -త్వరలోనే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు

Thalapathy Vijay: విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు.

Tamilnadu Early Polls :  తమిళనాడులో మళ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమయింది.  సుమారు 59 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ పార్టీల  ఆధిపత్యానికి గండికొట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని స్టాలిన్ జోస్యం  చెబుతున్నారు.  ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పిలుపునివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 సంఖ్యాబలంపై సందిగ్ధత 

ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు 107 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షమైన కాంగ్రెస్   బయటి నుంచి మద్దతు ఇస్తున్న డీఎంకే మిత్రపక్షాలు  మద్దతుతో విజయ్ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. వీరికి తోడు గత వారం జరిగిన బలపరీక్షలో 25 మంది ఏఐఏడీఎంకే  రెబల్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, ఈ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా లేదా బయటి నుంచి మద్దతు ఇస్తున్న పక్షాలు వెనక్కి తగ్గినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని డీఎంకే లెక్కలు వేస్తోంది.

 2029 లోక్‌సభతో పాటే ఎన్నికలు? 

తిరుచ్చిలో జరిగిన జిల్లా కార్యదర్శులతో జరిగిన సమావేశంలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు ఇప్పుడే క్షేత్రస్థాయికి వెళ్లాలి  అని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని, సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో కూడా ఓటమి పాలవ్వడంపై ఆయన బాధ్యత వహిస్తూనే, పార్టీని పునర్నిర్మించే పనిలో పడ్డారు.

 డిజిటల్ రాజకీయాలపై ఫోకస్ 

విజయ్ విజయంలో సోషల్ మీడియా పోషించిన పాత్రను స్టాలిన్ గుర్తించారు. గతంలో మనం టీ కొట్టుల దగ్గర చేసే రాజకీయ చర్చలు, ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జరగాలి అని క్యాడర్‌కు సూచించారు. టీవీకే డిజిటల్ ప్రచారంలో తమ కంటే ఎంతో ముందుందని పరోక్షంగా అంగీకరించిన ఆయన, డీఎంకే సోషల్ మీడియా ఉనికిని పెంచాలని ఆదేశించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించి, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.  

ధీమాగా విజయ్ వర్గం 

మరోవైపు స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే వర్గాలు ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. తమ వద్ద స్పష్టమైన మెజారిటీ ఉందని, ఐదేళ్ల పాటు పూర్తిస్థాయి పాలన అందిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారని, స్టాలిన్ వ్యాఖ్యలు కేవలం నిరాశతో చేసినవేనని కొట్టిపారేస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 21 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Embed widget