By: Ram Manohar | Updated at : 22 Dec 2022 06:12 PM (IST)
తాజ్‌మహల్‌కు వచ్చే సందర్శకులకు కొవిడ్ టెస్ట్ తప్పనిసరి చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. (Image Credits: ANI)
Taj Mahal on Covid-19:
కొవిడ్ అలెర్ట్..
భారత్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లోనూ కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే... ఆగ్రాలోని తాజ్‌మహల్ వద్ద అలెర్ట్ జారీ చేశారు. పెద్ద మొత్తంలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయాలని జిల్లా ఆరోగ్యాధికారి వెల్లడించారు. "ఇప్పటికే ఆరోగ్య విభాగానికి చెందిన అధికారులు కొవిడ్ టెస్ట్‌లు చేయడం మొదలు పెట్టారు. వీలైనంత వరకూ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి నుంచి సందర్శకులందరికీ కొవిడ్ టెస్ట్ తప్పనిసరి చేస్తాం" అని స్ఫష్టం చేశారు.
మూడు కేసులు..
గుజరాత్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 వెలుగులోకి వచ్చింది. ఓ NRI మహిళకు కొవిడ్ టెస్ట్ చేయగా...పాజిటివ్‌గా తేలింది. ఆమెకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 సోకిందని వైద్యులు వెల్లడించారు. సెప్టెంబర్‌లోనే ఈ మహిళకు ఈ వేరియంట్ సోకిందని తేలింది. గుజరాత్‌లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు రెండు నమోదయ్యాయి. వీరితో పాటు...ఒడిశాకు చెందిన ఓ వ్యక్తికి ఇదే కొవిడ్ వేరియంట్ బారిన పడ్డారు. చైనాలో ఇప్పటికే ఈ వేరియంట్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఈ సమయంలోనే భారత్‌లోనూ కేసులు నమోదవడం కలవర పెడుతోంది. సెప్టెంబర్‌లో NRI మహిళకు కొవిడ్ సోకగా...ఆ వైరస్ శాంపిల్‌ని ల్యాబ్‌కు పంపారు. గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్స్ సెంటర్‌లో పరిశోధించగా... అది BF.7 వేరియంట్ అని తేలింది. ప్రస్తుతం చైనాలో ఇదే వేరియంట్ అక్కడి ప్రజల్ని సతమతం చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనాలో ఆ స్థాయిలో కరోనా కేసులు పెరగటానికి ఈ వేరియంటే కారణమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రకటన చేసింది. వైరస్ వ్యాపించకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కోమోర్బిడిటిస్‌తో బాధపడే పెద్దవాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్ డోసులు తీసుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడారు.
" మీరు బయటి ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాస్క్ తప్పకుండా ధరించండి. కొమోర్బిడిటిస్‌తో బాధ పడుతున్న వాళ్ళు,పెద్ద వాళ్ళు ఇది పాటించడం చాలా ముఖ్యం. కేవలం 27-28 శాతం ప్రజలు మాత్రమే ప్రికాషన్ డోసులు తీసుకున్నారు. నేను అందరనీ మరి ముఖ్యంగా పెద్ద వయస్సు వ్యక్తులను ప్రికాషన్ డోస్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రికాషన్ డోస్ తీసుకోవడం అందరికి ముఖ్యం. "
- వీకే పాల్, నీతి అయోగ్ సభ్యుడు
Also Read: Covid-19 Surge: వీలైనంత త్వరగా ప్రికాషనరీ డోస్ తీసుకోండి - ప్రజలకు IMA సూచన
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ సెషన్ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
Anganwadi Jobs: వైఎస్సార్ కడప జిల్లాలో 115 అంగన్వాడీ పోస్టులు, వివరాలివే!
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!
K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!
Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్
K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు