Latest Weather Update: మరో గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ- తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు
Weather Update: అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు పడనున్నాయి.

Latest Weather Update: రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు మూడు రోజుల్లోల కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాల రాకకు అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొంది. రుతుపవనాలు రాక ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. అరేబియా సముద్రానికి ఆనుకొని ఏర్పడిన అల్పపీడనంతో రెండు రాష్ట్రాల్లో వర్షావరణం ఏర్పడింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.ఇప్పుడు బంగాళాఖాతంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడనుంది. వచ్చే వారం మొదట్లో అంటే 26-27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్‌లో రెండు రోజులు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఈ సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని చెబుతున్నారు. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తుపానుగా మారితే గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళపై తీవ్ర ప్రభావం ఉంటుంది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారుతూ ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
తెలంగాణలో వాతావరణఁ(Latest Weather In Telangana)
తెలంగాణలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల నుంచి వానలు కుమ్మేస్తున్నాయి. శుక్రువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అత్యధిక ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీలుగా నమోదు అయింది. చాలా ప్రాంతాల్లో ఈ సీజన్‌లో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు కంటే దాదాపు పది డిగ్రీల తక్కువ నమోదు అయ్యాయి. మరికొన్ని రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Latest Weather In Andhra Pradesh)
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణాజిల్లాల్లో చెదుమదురు వర్షాలు పడొచ్చు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.





















