BLOs Death Issue: SIR పని ఒత్తిడితో బీఎల్వోల బలవన్మరణాలు - ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు
SIR work pressure: సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైన రాష్ట్రాలలో బీఎల్వోలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

SIR work pressure on BLOs: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పని ఒత్తిడికి తట్టుకోలేక ఉత్తరాదిన పులువులు బూత్ లెవల్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సర్వేష్ అనే బీఎల్వో వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రెండు పేజీల సూసైడ్ నోట్‌లో బతకాలని ఉందని కానీ పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు. ఆయన ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడుస్తూ తల్లి, సోదరిని మన్నించమని, నలుగురు కూతుళ్ల ఆరోగ్యం చూసుకోమని వేడుకున్నారు. సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 30 మంది బీఎల్‌ఓలు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
సర్వేష్ సింగ్, మురాదాబాద్ బహేడీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సహాయక ఉపాధ్యాయుడు. అక్టోబర్ 7న మొదటిసారి బీఎల్‌ఓ బాధ్యతలు తీసుకున్నారు. SIR ప్రక్రియలో ఓ బూత్‌లో 956 మంది ఓటర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. 30 రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని లక్ష్యం. బీఎల్‌ఓలు రోజుకు 14-15 గంటలు పని చేస్తున్నా పూర్తి కావడం లేదని అంటున్నారు. రెండు-మూడు గంటలు మాత్రమే పడుకుంటున్నాను. SIR డెడ్‌లైన్‌కు చేరలేకపోతున్నాను. నలుగురు చిన్న కూతుళ్లు ఉన్నారు, వాటిలో ఇద్దరు అనారోగ్యంతో ఉన్నారు. మన్నించండి అని డిస్ట్రిక్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను ఉద్దేశించి రాసిన సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు.
This is the video of BLO Sarvesh Singh before he committed suicide. He was crying and asking to take care of his daughters.
— Saral Patel (@SaralPatel) December 1, 2025
BLOs are under such extreme stress that they are dying. 30 BLOs have taken their lives, yet @ECISVEEP is shamelessly posting videos on X showing dance… https://t.co/sJ0GzGDOO1 pic.twitter.com/6IBMJuywQz
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అక్టోబర్ 25, 2025 నుంచి 12 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, చత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, ఢిల్లీ, పుడుచ్చేరి, జమ్మూ కాశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైంది. డిసెంబర్ 4 వరకు ఎన్యూమరేషన్ స్టేజ్ పూర్తి చేయాలి. బీఎల్‌ఓలు ఇంటింటి వివరాలు సేకరించి, వోటర్ లిస్ట్ సవరణ చేస్తారు. ఒక్కో బూత్‌లో 800-1000 మంది వోటర్లు ఉంటారు. 2025లో SIR ప్రక్రియలో 30 మంది బీఎల్‌ఓలు ఆత్మహత్యలు చేసుకున్నట్టు Xలో వైరల్ పోస్ట్‌లు, వార్తలు చెబుతున్నాయి. అయితే అధికారికంగా 10-15 మరణాలు నమోదయ్యాయి.
Quick Break, Stronger Team ✨
— Election Commission of India (@ECISVEEP) November 30, 2025
Election officials including BLOs enjoying break time in between their work under the ongoing #SIR in #Kerala @Ceokerala pic.twitter.com/PpdGlBT8nW
ఎన్నికల కమిషన్ X హ్యాండిల్ ECISVEEP ద్వారా SIR ప్రక్రియను ప్రమోట్ చేస్తూ 'సెల్యూట్ టు బీఎల్‌ఓలు' హ్యాష్‌ట్యాగ్‌తో వీడియోలు పోస్ట్ చేస్తోంది. నవంబర్ 30న కేరళలో బీఎల్‌ఓలు 'క్విక్ బ్రేక్'లో డాన్స్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు.





















