అన్వేషించండి

Bangladesh: బంగ్లాదేశ్‌కి తిరిగి వెళ్లనున్న షేక్ హసీనా! అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తారట!

Sheikh Hasina: త్వరలోనే షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతారని ఆమె కొడుకు సాజీబ్‌ వెల్లడించారు. అక్కడ ఎన్నికల షెడ్యూల్ రాగానే వెళ్లి పోటీ చేస్తారని చెప్పారు.

Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకి వచ్చిన షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆమె కొడుకు ఓ ప్రకటన చేశారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా అప్పుడు బంగ్లాదేశ్‌కి వెళ్తామని వెల్లడించారు. దాదాపు నెల రోజులుగా బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. రిజర్వేషన్‌లలో కోటాపై అక్కడి యువత ప్రభుత్వంపై తిరగబడింది. ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు అదుపు తప్పాయని గ్రహించిన షేక్ హసీనా వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చేశారు. ఆ వెంటనే అక్కడ పార్లమెంట్ రద్దైంది. ఆపద్ధర్మ ప్రధానిగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 

అయితే..ఈ పరిణామాల మధ్య షేక్ హసీనా కొడుకు సాజీబ్ వాజీద్ జాయ్‌ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రస్తుతానికి పరిస్థితులు బాగోలేక ఆమె ఇండియాలో ఉన్నారని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతారని తేల్చి చెప్పారు సాజీబ్. అయితే...ఆమె బంగ్లాదేశ్‌కి వెళ్లే అక్కడి ఆందోళనకారులు ఊరుకుంటారా లేదా అన్నదే అంతు తేలని ప్రశ్న. ఆమె పేరు చెబితేనే రగిలిపోతున్నారంతా. పైగా ఆమె తండ్రి రెహమాన్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నియంతలా పరిపాలించారంటూ తీవ్రంగా మండి పడుతున్నారు. 

ప్రస్తుత ఆపద్ధర్మ ప్రభుత్వంలో షేక్ హసీనా పార్టీ ఆవామీ లీగ్ ప్రాతినిధ్యమే లేదు. పూర్తిగా ఈ పార్టీని తప్పించేయాలని భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. పైగా జమాతే ఇస్లామీ పార్టీ కూడా అక్కడి ఆందోళనకారుల్ని రెచ్చగొడుతోంది. హిందువులపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ అల్లర్ల కారణంగా 300 మంది చనిపోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అసలు పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో కూడా తెలియడం లేదు. కొత్త ప్రభుత్వానికి ఇదే సవాల్ కానుంది. ప్రస్తుతానికి ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు షేక్ హసీనా. మోదీ సర్కార్ మాత్రం ఆమెకి పూర్తిగా ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఫలితంగా ఆమె ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. యూకేకి వెళ్దామని అనుకున్నా ఆ దేశం ఆంక్షలు విధించింది. (Also Read: Manish Sisodia: లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్, 17 నెలల తరవాత ఊరట)

అమెరికా అయితే ఏకంగా ఆమె వీసాని రద్దు చేసింది. ఇప్పటికి తాత్కాలికంగా ఇండియాలో తలదాచుకున్న షేక్ హసీనా ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్లిపోక తప్పేలా లేదు. ఈ విషయమై భారత్, బంగ్లాదేశ్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమెని అరెస్ట్ చేయాలంటూ బంగ్లాదేశ్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఆమె కొడుకు మాత్రం ఎన్నికల గురించి ప్రస్తావించడం మరింత ఆందోళనకరంగా మారింది. పైగా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని చాలా ధీమాగా చెబుతున్నారు. ఇది ఆందోళనకారుల్లో ఇంకాస్త ఆగ్రహం పెంచేలా కనిపిస్తోంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు వెనకాడుతోంది. త్వరలోనే ఆమె ఏదో ఓ నిర్ణయం తీసుకుని ఇండియా నుంచి వెళ్లిపోతారని సమాచారం. 

Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శన, ఆమీర్ ఖాన్ సమక్షంలో మూవీ చూడనున్న సీజేఐ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget