Supreme Court: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ సినిమా ప్రదర్శన, ఆమీర్ ఖాన్ సమక్షంలో మూవీ చూడనున్న సీజేఐ
Laapata Ladies: లాపతా లేడీస్ సినిమాని సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సమానత్వం థీమ్‌తో తెరకెక్కిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది.
Laapata Ladies To Be Screened in Supreme Court: బాలీవుడ్‌లో మంచి టాక్ తెచ్చుకున్న లాపతా లేడీస్ ( Laapata Ladies) సినిమాని సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. కిరణ్ రావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ మూవీలోని కొన్ని సీన్లు, పాటలు వైరల్ అయ్యాయి. చాలా బాగుందంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. లింగ సమానత్వం థీమ్‌తో తీసిని ఈ సినిమాని సుప్రీంకోర్టులో జడ్జ్‌ల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు అడ్మిన్ విభాగం ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సినిమా స్క్రీనింగ్ సమయంలో నిర్మాతలు ఆమీర్ ఖాన్, కిరణ్ రావు కూడా అక్కడే ఉంటారని వెల్లడించింది. సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలిపింది. (Also Read: Manish Sisodia: లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకి సుప్రీంకోర్టు బెయిల్, 17 నెలల తరవాత ఊరట)
"సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే లాపతా లేడీస్ సినిమాని కోర్టులో ప్రదర్శించనున్నాం. ఆగస్టు 9వ తేదీన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ సమక్షంలో అడ్మిన్ బిల్డింగ్‌లోని ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తాం"
- సుప్రీంకోర్టు అడ్మిన్ విభాగం
Movie “Laapataa Ladies” to be screened at the #SupremeCourt tomorrow as part of gender sensitisation training.
— Live Law (@LiveLawIndia) August 8, 2024
Movie director Kiran Rao and producer Aamir Khan to be present for interaction. pic.twitter.com/XaBlrcGrsp
చీఫ్ జస్టిస్‌తో పాటు సుప్రీంకోర్టు జడ్జ్‌లు తమ కుటుంబ సభ్యులతో సహా కలిసి ఈ సినిమాని వీక్షించనున్నారు. సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 వరకూ ఈ షో వేయనున్నారు. జియో స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీని ఆమీర్ ఖాన్ నిర్మించగా కిరణ్ రావు డైరెక్ట్ చేశారు. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాని రిలీజ్ చేశాయి. బిప్లవ్ గోస్వామి రాసిన కథను ఆధారంగా తీసుకుని ఈ సినిమా తీశారు. స్నేహా దేశాయ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. దివ్యనిధి శర్మ అడిషనల్ డైలాగ్స్ రాశారు. మార్చి 1వ తేదీన విడుదలైన ఈ మూవీకి మొదట్లో పెద్దగా వసూళ్లు రాలేదు. తరవాత పాజిటివ్ టాక్ రావడం వల్ల క్రమంగా కలెక్షన్స్ పెరిగాయి. క్రిటిక్స్ కూడా బాగుందని కితాబిచ్చారు. ఫస్ట్ వీక్‌లో రూ.6 కోట్లతో సరిపెట్టుకున్న లాపతా లేడీస్ సినిమా 50 రోజులు పూర్తయ్యే సరికి రూ.17 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. లో బడ్జెట్ మూవీ కావడం వల్ల ఈ కలెక్షన్స్‌తోనే లాభాలు వచ్చాయి. OTTలోనూ బాగానే సందడి చేసిందీ సినిమా. నటీ నటులకూ మంచి పేరొచ్చింది.
Also Read: Viral News: కర్ణాటక నవ దంపతుల మృతి కేసులో ట్విస్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్‌లతో సంచలనం