Russia-Ukraine War: మోదీజీ మౌనం వీడండి- దయచేసి మాకు సాయం చేయండి: ఉక్రెయిన్
రష్యాతో యుద్ధం జరుగుతోన్న వేళ ఉక్రెయిన్ భారత్ సాయం కోరింది. ప్రపంచంలోనే శక్తిమంతమైన నేతల్లో ఒకరైన మోదీ.. తమకు అండగా నిలవాలని కోరుతోంది.
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండేంటి? అనేది ఇప్పుడు ప్రపంచదేశాల మదిలో మెదులుతోన్న ప్రశ్న. యుద్ధాన్ని ఆరంభించిన రష్యాపై ఇప్పటికే అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. రష్యాపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. భారత్ మాత్రం ఎప్పటిలానే శాంతిమంత్రాన్నే జపించింది. భారత విదేశాంగ సహాయ మంత్రి డా. రాజ్‌కుమార్ రంజన్ ఈ మేరకు ప్రకటించారు.
భారత్ సాయం కావాలి
మరోవైపు ఉక్రెయిన్ మాత్రం భారత్ సంపూర్ణ మద్దతు కావాలని కోరుతోంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ దేశ రాయబారి ఇగోర్ పొలిఖా పేర్కొన్నారు. తక్షణమే యుద్ధం నిలువరించే దిశగా భారత్ చర్యలు తీసుకోవాలి కోరారు. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.
Also Read: Ukraine Russia War: యుద్ధం అయిపోయాక రష్యా పరిస్థితేంటి? పుతిన్ వ్యాఖ్యలకు అర్థమేంటి?