Russia Ukraine War: రష్యా విమానాలు, హెలికాప్టర్ కూల్చేశాం - ఉక్రెయిన్ ప్రకటన, వారి ఎయిర్ డిఫెన్స్ మొత్తం నాశనం చేశాం: రష్యా
లుహాన్స్‌క్ రీజియన్‌లో ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చి వేసినట్లుగా ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది.
![Russia Ukraine War: రష్యా విమానాలు, హెలికాప్టర్ కూల్చేశాం - ఉక్రెయిన్ ప్రకటన, వారి ఎయిర్ డిఫెన్స్ మొత్తం నాశనం చేశాం: రష్యా Ukraine Russia War Ukraine military says five Russian planes helicopter shot down Luhansk region Russia Ukraine War: రష్యా విమానాలు, హెలికాప్టర్ కూల్చేశాం - ఉక్రెయిన్ ప్రకటన, వారి ఎయిర్ డిఫెన్స్ మొత్తం నాశనం చేశాం: రష్యా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/3c8ea5920ae4ec5738ea9e1e2e7b6275_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ukraine Russia War: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరుతోంది. తాజాగా రష్యా చేస్తున్న సైనిక చర్యను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ ప్రతీకార దాడులను మొదలుపెట్టింది. ఈ మేరకు తమ సైన్యం రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చి వేసినట్లుగా ఉక్రెయిన్ మిలిటరీ ప్రకటించింది. లుహాన్స్‌క్ రీజియన్‌లో వీటిని కూల్చామని ప్రకటించింది. ఈ వారం మొదట్లో రష్యా స్వతంత్రంగా గుర్తించిన ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలలో ఈ లుహాన్స్‌క్ రీజియన్ కూడా ఒకటి. మరోవైపు, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఉక్రెయిన్ వైమానిక దళాన్ని అదుపు చేయగలిగామని పేర్కొంది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. మరోవైపు, నాటో దళాలు కూడా రష్యాపై ఎదురుదాడికి దిగాయి.
Ukraine military says five Russian planes and a Russian helicopter were shot down in Luhansk region: Reuters
— ANI (@ANI) February 24, 2022
ఖాళీగా తిరిగి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం
యుద్ధం నేపథ్యంలో ఎయిర్ పోర్టులు, గగనతలాన్ని (ఎయిర్ స్పేస్) ఉక్రెయిన్ మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకొచ్చేందుకు కీవ్ కు వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం ఖాళీగా తిరిగి దేశానికి వస్తోంది. గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుంచి ఏఐ1947 ఎయిర్ ఇండియా విమానం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి బయలుదేరింది. కీవ్ లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం చేరుకోవాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించిన కారణంగా ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు వెనక్కి పిలిపించారు.
కీవ్ నుంచి భారత్ కు బయల్దేరిన మరో విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు దిల్లీకి చేరుకుంది. 182 మంది భారతీయులు ఈ విమానంలో దేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ లోని భారతీయ పౌరులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. భారతీయులను దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. భారతీయ పౌరులను క్షేమంగా దేశానికి తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా చర్చిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గగనతలాన్ని మూసేసిన కారణంగా భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఇతర మార్గాలను అధికారులను అన్వేషిస్తున్నారు. ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం పనిచేస్తూనే ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ప్యారిస్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ కు తిరిగి వస్తున్నారు. రష్యా వరుస దాడుల కారణంగా తూర్పు ఉక్రెయిన్ తన గగనతలాన్ని డేంజర్ జోన్ గా పేర్కొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)