Rude Kid On KBC: అమితాబ్‌తోనే అగౌరవంగా ప్రవర్తించిన పదేళ్ల బాలుడు - కేబీసీ షో వీడియో వైరల్ !
KBC 17 Amitabh Bachchan: అమితాబాద్ బచ్చన్ అంటే అందరూ గౌరవిస్తారు. కానీ ఐదో తరగతి చదివే ఆ కుర్రాడు అమితాబ్ ను అవమానించినట్లుగా వ్యవహరించారు. కానీ అమితాబ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని లైట్ తీసుకున్నారు.

Rude Kid On KBC 17 Goes Viral : కౌన్ బనేగా కరోరేపతి (కేబీసీ) సీజన్ 17లో గుజరాత్‌కు చెందిన 10 ఏళ్ల చిన్నారి ఇషిత్ భట్ట్ హాట్ సీట్‌పై కనిపించిన ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఈ చిన్నారి ప్రవర్తనను 'రూడ్', 'ఓవర్‌కాన్ఫిడెంట్' అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, హోస్ట్ అమితాభ్ బచ్చన్ ఈ సమస్యను అద్భుతంగా హ్యాండిల్ చేశారని ఇంటర్నెట్ ప్రశంసలు కురిపిస్తోంది. ఇషిత్ ప్రైజ్ మనీ గెలవకుండా షో నుంచి వెళ్లిపోయాడు.
గాంధీనగర్, గుజరాత్‌కు చెందిన 5వ తరగతి విద్యార్థి ఇషిత్ భట్ట్, అక్టోబర్ 9న జరిగిన కేబీసీ 17 ఎపిసోడ్‌లో హాట్ సీట్‌పై కనిపించాడు. ఏ మాత్రం సహనం లేకుండా మాట్లాడాడు. అమితాభ్ బచ్చన్ రూల్స్ వివరిస్తుంటే, ఇషిత్ నాకు రూల్స్ తెలుసు, ఇప్పుడు వాటిని వివరించకండి అని చెప్పి అందరినీ షాక్‌కుగురి చేశాడు. ఆప్షన్లు ఇవ్వకముందే ఆప్షన్లు ఇవ్వండి అని డిమాండ్ చేశాడు. లాక్ చేసేటప్పుడు ఒక్కటి కాదు, నాలుగు లాక్‌లు పెట్టండి, కానీ లాక్ చేయండి అని గదమాయించాడు.
Very satisfying ending!
— THE SKIN DOCTOR (@theskindoctor13) October 12, 2025
Not saying this about the kid, but the parents. If you can't teach your kids humility, patience, and manners, they turn out to be such rude overconfident lot. Not winning a single rupee will surely pinch them for a long time.
pic.twitter.com/LB8VRbqxIC
రామాయణం సంబంధిత ప్రశ్న వాల్మీకి రామాయణంలో మొదటి కాండం పేరు ఏది అన్న ప్రశ్నకు సరైన సమాధానం 'బాల కాండం' అయినప్పటికీ, ఇషిత్ తప్పు సమాధానం ఇచ్చి ఏ ప్రైజ్ మనీ లేకుండా షో నుంచి వెళ్లాడు. ఈ క్లిప్ వైరల్ అయింది.
అమితాభ్ బచ్చన్ చిన్నారి ప్రవర్తనపై ఏ మాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. కొన్నిసార్లు చిన్నారులు ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో తప్పులు చేస్తారు అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్ కాగానే, చాలామంది ఇషిత్ ప్రవర్తనను 'అన్‌అక్సెప్టబుల్' అని విమర్శించారు. Xలో వేలాది పోస్టుల్లో "మోస్ట్ హేటెడ్ కిడ్ ఆన్ ఇంటర్నెట్" అని ప్రచారం చేశారు. విలువలు లేకుండా ప్రతి దాన్నీ ఇవ్వవచ్చు, కానీ గౌరవం మర్చిపోతే అది పెద్దల తప్పిదమేనని ఆ బాలుడి తల్లిదండ్రులపై విమర్శలు చేశారు.
Not blaming the kid, but the parents.
— Suraj Choudhary (@bollywoodbroo) October 13, 2025
If you don’t teach your child humility, patience, and manners, they grow up rude and overconfident.
Sometimes losing — and not winning even a single rupee — teaches the best lesson. #KBC #AmitabhBachachan pic.twitter.com/gG7gIO4jgo
కేబీసీ 17 TRPలు 1.6-1.8కి పడిపోయాయి, కానీ ఈ ఎపిసోడ్ వల్ల తాత్కాలికంగా 2.1కి పెరిగాయి. ఇషిత్ ప్రవర్తన గతంలో 1 కోటి ప్రశ్నలో ఓవర్‌కాన్ఫిడెన్స్‌తో ఓడిపోయిన మరొక చిన్నారిని గుర్తు చేసింది. ఈ డిబేట్ చిన్నారులపై పబ్లిక్ స్క్రూటినీ, టాక్సిక్ పేరెంటింగ్‌పై చర్చలకు దారి తీసింది.





















