By: ABP Desam | Updated at : 14 Mar 2023 01:16 PM (IST)
నాటు నాటుకు రాజ్యసభ ప్రశంసలు
Rajyasabha RRR : పార్లమెంట్ సమావేశాల్లోనూ RRR సినిమా హాట్ టాపిక్ అయింది. ఆస్కార్ వేదిక చరిత్ర సృష్టించిన మన తెలుగు సినిమా ట్రిపులార్ గురించి రాజ్యసభలోనూ ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజ్యసభ చైర్మన్ జగదీఫ్ ధన్ ఖడ్ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. సభలో ఉన్న సభ్యుల చప్పట్లు కొట్టారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు కూడా రాజ్యసభ చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. ఇది అంతర్జాతీయంగా లభించిన గుర్తింపుగా అభివర్ణించారు.
Congratulations to V Vijayendra Prasad on the #Oscars win for RRR. An esteemed MP of Rajya Sabha, @VVPrasadWrites has written the screenplay of RRR. Also congratulations to Kartiki Gonsalves & Guneet Monga for exemplifying #NariShakti & winning #Oscars for The Elephant Whisperers pic.twitter.com/QdgyMRHEXk
— Pralhad Joshi (@JoshiPralhad) March 14, 2023
అయితే ఈ అంశంపై రాజకీయం కూడా చోటు చేసుకుంది. భారత దేశానికి రెండు ఆస్కార్ అవార్డులు దక్కడంపై రాజ్యసభలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్ ఖర్గే స్పందించారు. ట్రిపులార్‌తో పాటు, ది ఎలిఫెంట్ విస్పర్స్ చిత్రయూనిట్స్‌కి ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంలో ప్రధాని మోదీకి తనదైన శైలిలో చురకలు అంటించారు ఖర్గే. ఆస్కార్ విజయాలను మోదీ గారు తమ ఖాతాలో వేసుకోకండి అంటూ చమత్కరించారు.
Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world.
— Congress (@INCIndia) March 14, 2023
We request Modi ji not to take the credit for their win.
:Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF
అలాగే కాంగ్రెస్ పార్టీ అదానీ విషయంలో పార్లమంట్‌లో జేపీసీ కోసం పోరాటం చేస్తోంది దీన్ని ఆన్ లైన్‌లోనూ కొనసాగిస్తోంది. నాటు నాటు పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఇమేజ్‌ల స్ధానంలో మోదీ అదానీల ఫొటోలను చేర్చి ఆపై లిరిక్స్ నాటు..నాటు స్ధానంలో లూటో..లూటో పదాలతో మార్చింది. పార్లమెంట్‌లో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ-హిండెన్‌బర్గ్ కేసును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్‌ను షేర్ చేసింది.
लूटो-लूटो pic.twitter.com/6ztby1n3wd
— Congress (@INCIndia) March 13, 2023
Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం
Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ పొలిటికల్ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!
Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా?
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?
Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?