అన్వేషించండి

Tirumala News: 2023లో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం - వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం

Andhra News: తిరుమల శ్రీవారికి 2023లో రికార్డు స్థాయి ఆదాయం లభించింది. హుండీ ద్వారా మొత్తం రూ.1398 కోట్లు లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Record Revenue of Tirumala Srivari Temple in 2023: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వరునికి 2023లో హుండీ ఆదాయం భారీగా సమకూరింది. తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి శ్రీవారి ఆలయానికి (Srivari Temple) భక్తుల తాకిడి పెరిగింది. రోజుకు సగటున రూ.3 కోట్ల ఆదాయం దాటింది. ఈ క్రమంలో 2023లో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1398 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారికి భక్తులు భారీగా నగదు, ఇతర విలువైన కానుకలు సమర్పించారు. 2023లో ప్రతీ నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు అధికారులు వెల్లడించారు. జులైలో అత్యధికంగా రూ.123 కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు చెప్పారు. నవంబర్ లో అత్యల్పంగా రూ.108 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నెలలోనూ రూ.116 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరగడంతో పాటు స్వామి వారి హుండీ ఆదాయం సైతం పెరుగుతోంది. 

10 రోజుల్లో రూ.40.20 కోట్లు

ఇక, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రూ.40.20 కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO DharmaReddy) తెలిపారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకూ 10 రోజుల పాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించినట్లు చెప్పారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. 17.81 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని, 35.60 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించారని, 2.13 లక్షల మంది తలనీలాలు సమర్పించారని చెప్పారు. భక్తులకు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించి నాలుగేళ్లవుతోంది. 2020లో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిన టీటీడీ, దేశంలోని మఠాధిపతులు, పీఠాధిపతుల అనుమతులతో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించవచ్చని ఆగమ సలహా మండలి సైతం ఆమోదముద్ర వేసింది. 

వన్య మృగాల సంచారంపై

కాగా, ఇటీవల తిరుమలలో వన్య మృగాల సంచారంపై ఈవో ధర్మారెడ్డి స్పందించారు. కాలిబాట మార్గంలో వన్య మృగాల సంచారం నేపథ్యంలో శేషాచల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్య మృగాల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే రూ.3.50 కోట్లతో అధునాతన కెమెరాలు కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. 

నేటి నుంచి శ్రీవారి సర్వ దర్శనాలు

వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం నుంచి శ్రీవారి సర్వ దర్శనాల టోకెన్ల జారీని అధికారులు పునఃప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమయ్యాయి. మరోవైపు, జనవరిలో విశేష పర్వదినాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 5న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు, 6న తిరుమల శ్రీవారి సన్నిధికి వేంచేపు, 7న సర్వ ఏకాదశి, 9న తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 14న భోగి ముగింపు, ధనుర్మాసం ముగింపు, 15న మకర సంక్రాంతి సుప్రభాత సేవ పునఃప్రారంభం, 16న తిరుమల శ్రీవారి పార్వేట మండపానికి వేంచేపు, కనుమ పండుగ, 25న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, 28న తిరుమొళిశైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 31న కూరత్తాళ్వార్ తిరు నక్షత్రం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Also Read: Anganwadi staff : అంగన్‌వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం- విధుల్లో చేరకుంటే చర్యలు తప్పవని వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
KTR ED Notice: ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ షాక్, విచారణకు రావాలని నోటీసులు
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Embed widget